హైదరాబాద్ మహానగరానికి అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్ కు చోటు దక్కింది. నగరంలో మొత్తం 11,100 మంది మిలియనీర్లు ఉన్నట్లు హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ అధ్యయనంలో వెల్లడించింది.
ప్రపంచంలో అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్ కు చోటు దక్కింది. నగరంలో మొత్తం 11,100 మంది మిలియనీర్లు ఉన్నట్లు హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ అధ్యయనంలో వెల్లడించింది. పది లక్షల డాలర్లకు పైగా ఆస్తులు ఉన్న వ్యక్తులను మిలియనీర్లుగా పరిగణలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందిస్తారు. పది లక్షల డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ.8.2 కోట్లు.
ప్రపంచ వ్యాప్తంగా 97 నగరాలు ఈ జాబితాలో ఉండగా.. మన హైదరాబాద్ కు 65వ స్థానం లభించింది. న్యూయార్క్ నగరం తొలి స్థానం పొందింది. 2012 నుంచి 2022 మధ్య హైదరాబాద్ లో అత్యధిక సంపన్నుల లో 78 శాతం పెరిగిందని నివేదిక తెలిపింది. హైదరాబాద్ లో 40 మంది సెంటీ మిలియనీర్లు, ఐదుగురు బిలియనీర్లను నివేదికలో పేర్కొన్నారు. ఇక ఈ భాగ్య నగరానికి ఘనమైన చరిత్ర ఉంది.
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలో అతి చిన్నది హైదరాబాద్. కానీ ఇది అత్యధిక జన సాంద్రత కలిగి ఉంది. అలానే రాష్ట్రంలో అత్యధిక ఆదాయం కలిగిన జిల్లా ఇదే. ఈ జిల్లా 1948లో జిల్లాగా ఏర్పడింది. 1978 తర్వాత హైదరాబాద్ అర్బన్ జిల్లాగా పిలువబడింది. ఇక్కడ వజ్రాలు, పచ్చలు సహజ ముత్యాల వ్యాపారానికి ప్రపంచ స్ధాయిలో పేరుగాచి భాగ్యనగరం, ముత్యాల నగరంగా కీర్తి పొందింది. ఈ మహానగరంలో మక్కామసీదు, చార్మినార్, గోల్కొంండ కోట, కుతుబ్ షాహీ సమాధులు, చారిత్రాత్మక నిర్మాణాలు, ఫలక్ నుమా ప్యాలెస్ మొదలైనవి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.
బిర్లా మందిర్, జగనాథ్ ఆలయం, సాలార్ జంగ్ మ్యూజియం, మహాంకాళి గుడి, హుస్సేన్ సాగర్, కె.బి.ఆర్ పార్క్ ఇతర ప్రధాన పర్యాటక ప్రాంతాలు. ఇలాంటి చారిత్రక గుర్తింపు పొందిన ఈ నగరం తాజాగా ధనవంతుల నగరంగా రికార్టు సొంతం చేసుకుంది. హైదరాబాద్ లో 40 మంది సెంటీ మిలియనీర్లు, ఐదుగురు బిలియనీర్లను నివేదికలో పేర్కొంది. ఇక ఈ అధ్యాయనం ఎలా చేస్తారంటే.. దేశాలు, నగరాల మధ్య సంపద, వలస పోకడలను గమనించే స్వతంత్ర పరిశోధన సంస్థ న్యూ వరల్డ్ వెల్త్ సహకారంతో అధ్యయన చేసి.. నివేదిక రూపొందించినట్లు హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ పేర్కొంది.