హుస్సేన్ సాగర్ బోటింగ్‌కు ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆదివారం, సెలవు దినాల్లో రద్దీ బాగా ఉంటుంది. అయితే తాజాగా హుస్సేన్‌సాగర్‌లో పెను ప్రమాదం తప్పింది. ఆవివరాలు..
హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కడెక్కడో నుంచి జనాలు ఉపాధి కోసం నగరానికి తరలి వస్తారు. భాగ్యనగరాన్ని చూస్తే.. మిని ఇండియా అనే ఫీలింగ్ కలగకమానదు. ఇండ్లలో పని చేసుకునేవారు మొదలు.. పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగులు ఇలా భిన్న రంగాలు, జాతులు, మతాల వారు హైదరబాద్‌లో కనిపిస్తారు. పర్యటకపరంగా కూడా హైదరాబాద్ ఎంతో ప్రాధాన్యత సాధించుకుంది. మరీ ముఖ్యంగా నగరంలోని చార్మినార్, గోల్కొండ, హుస్సేన్‌సాగర్, సాలర్‌జంగ్ మ్యూజియం.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో. హైదరాబాద్‌లో అడుగడుగునా పర్యాటక ప్రదేశాలే కనిపిస్తాయి. ఇక ఈ మధ్య కాలంలో హుస్సేన్ సాగర్, టాంక్ బండ్ ప్రదేశాల్లో ప్రభుత్వం అనేక మార్పులు చేపట్టింది. పర్యాటకుల కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టింది. ఇక హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్ చాలా ఫేమస్. అయితే మంగళవారం హుస్సేన్‌సాగర్‌లో పెను ప్రమాదం తప్పింది. ఆవివరాలు..
హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్ చాలా ఫేమస్. వేసవి కాలం సెలవులు కూడా ప్రారంభం కావడంతో బోటింగ్‌కు రద్దీ పెరిగింది. పర్యాటకుల రాకతో టాంక్‌బండ్ ప్రాంతం కిటకిటలాడుతోంది. మంగళవారం నగరంలో భారీ వర్షం పడిన సంగతి తెలిసిందే. ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా.. హుస్సేన్‌సాగర్‌లో ప్రమాదకర పరిస్థితులు అనుభవంలోకి వచ్చాయి. మంగళవారం రాత్రి పర్యాటకులను తీసుకుని.. బుద్ధ విగ్రహం వద్దకు వెళ్లిన బోటు ఈదురు గాలులు, వర్షం కారణంగా అదుపు తప్పింది. దాంతో బోటులో ఉన్న ప్రయాణికులు భయంతో కేకలు వేశారు.
బోటు ముగినిపోతే.. అందరి ప్రాణాలు గల్లంతయ్యేవి. అయితే ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే అప్రమత్తయిన సిబ్బంది.. స్పీడ్ బోట్ల సాయంతో.. పర్యటాక బోటు దగ్గరకు వెళ్లారు. దానిలో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ సమయంలో బోటులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇక మంగళవారం సాయంత్రం నుంచి నగరంలో భారీ వర్షం కురస్తోంది. రాగల ఐదు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.