భార్యభర్తల బంధాన్ని అర్థం మార్చేసే విధంగా వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. భార్య సరిగా లేదనో, భర్త తనకు సమయం కేటాయించడం లేదన్న కారణాలతో పరాయి వ్యక్తుల మోజులో పడుతున్నారు. దీంతో జీవితాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ఓ వ్యక్తితో అక్రమ సంబంధం నెరిపిన తన భార్యకు బుద్ధి చెప్పాడో భర్త
దేశంలో వివాహా బంధాలు నానాటికి పెడదోవ పడుతున్నాయి. భార్యభర్తల బంధాన్ని అర్థం మార్చేసే విధంగా వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. భర్త అర్థం చేసుకోవట్లేదని భార్య, తన మాట భార్య వినడం లేదని భర్త కుంటి సాకులతో పరాయి స్త్రీ, పురుషలతో అక్రమ సంబంధాలు నెరుపుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సాగే ఈ సంబంధం రెండు జీవితాలే కాదూ కుటుంబాలకు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. పిల్లలు సైతం అనాధలుగా మారిన సంఘటనలు ఎన్నో చూశాం. అయితే ఈ వివాహేతర సంబంధం బయటపడ్డాక..అవమానం భరించలేక కొంత మంది అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
భార్య అక్రమ సంబంధం బయట పెట్టిన ఓ ఉ్యదోగి..చివరకు ఆమెకు ఎలాంటి ఓ కఠినమైన శిక్ష విధించాడు. ఆమెకు బుద్ధి వచ్చేలా చేశాడు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మంగ పేట మండల కేంద్రంలో ఓ జంట నివసిస్తోంది. భర్త ఎఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తుండగా, భార్య ప్రభుత్వ పాఠశాలలో అసిస్టెంట్ టీచర్ గా పనిచేస్తోంది. అయితే ఆమె మరో ఉపాధ్యాయుడు కుక్కల నాగేంద్రబాబుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియగానే.. భార్యను పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ సదరు మహిళ వినిపించుకోలేదు. వారిద్దరూ ఆ సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే తన భర్త విధుల నిమిత్తం బయటకు వెళ్లగా.. వివాహిత ఉపాధ్యాయుడితో సరసాల్లో మునిగి తేలింది.
అప్పుడే ఇంటికి వచ్చిన భరత్ రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకున్నారు. ఉపాధ్యాయుడ్ని తొలుత గుంజకు కట్టేశాడు. ఆ తర్వాత భార్యను.. ఆమె సంబంధం నెరుపుతున్న ఉపాధ్యాయుడ్ని ఓ తాడుతో చేతులు కట్టేసిన భర్త.. పోలీసుల స్టేషన్ వరకు కొట్టుకుంటూ నడిపించాడు. పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటనపై అక్కడ ఉన్నవారంతా ఇదే మాయం రోగం అంటూ అక్కడ ఉన్నవారంతా తిట్టిపోస్తున్నారు. అక్రమ సంబంధాల కారణంగా పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి. అయినప్పటికీ సిల్లీ కారణాలతో భార్య భర్తలు.. వివాహేతర సంబంధాలను నెరుపుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.