పెళ్ళంటే నూరేళ్ళ పంట అని అంటారు పెద్దలు. అయితే పెద్దలు కుదిర్చిన వివాహమైనా, ప్రేమ వివాహమైనా వారిలోని విభేదాల కారణంగా వారి కాపురాలు కూలిపోతున్నాయి. ఇలా వారి కాపురాలు కూలి పోవడానికి పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం ముఖ్య కారణం. భార్య వేరే వ్యక్తితో… భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకోకటి తెర మీదకు వస్తున్నాయి. అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు ఓ భర్త.
ఓ వ్యక్తి తన భార్య అక్రమ సంబంధాన్ని రెడ్ హ్యండ్ గా పట్టుకొని గ్రామస్థుల ముందు నిలబెట్టాడు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. పురుషోత్తం, సుమలత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగాలు వేరు వేరు ప్రదేశాల్లో ఉండటంతో స్థానికంగా కిరాయి తీసుకొని ఉంటున్నారు. సుమలతకు పక్క ఊరుకు చెందిన కారు మెకానిక్ లింగరాజుతో పరిచయం కావడం.. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడం జరిగింది. తన భార్య అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న పురుషోత్తం ఇద్దరినీ పలుమార్లు హెచ్చరించారు.
ఈ విషయంపై పలు మార్లు పంచాయతీ కూాడా పెట్టించాడు భర్త. కానీ భార్య తీరు మారలేదు.. అంతే కాదు అల్లుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుమలత తల్లి.. అబండాలు వేయడం కాదు వారిని రెడ్ హ్యండ్ గా పట్టి చూపించాలని చెప్పింది. ఈ క్రమంలోనే తన ప్రియుడితో సుమలత ఉండటం గమనించి వారిని రెడ్ హ్యండ్ గా పట్టుకొని తాళ్లతో కట్టి గ్రామస్థుల ముందు నిలిపాడు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించాడు.