తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తీసుకొచ్చిన చలాన్ డిస్కౌంట్ ఆఫర్ కు భారీ స్పందన లభిస్తోంది. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పెండింగ్ చలాన్లు మొత్తం ఇప్పుడే క్లియర్ చేసుకుంటున్నారు. అది కూడా నిమిషానికి 700 పెండింగ్ చలాన్లు క్లియర్ అవుతున్నాయి. ఓ రకంగా ఇది కూడా రికార్డనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో నాలుగేళ్ల వ్యవధిలో 6.19 కోట్ల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ లు పెడుతున్నా కూడా వాటిలో కదలిక లేదు.
అందుకే ట్రాఫిక్ పోలీసులు వినూత్న ఆలోచన చేసి ఈ డిస్కౌండ్ ఆఫర్లు కల్పించారు. మార్చి 1 నుంచి 31 వరకు భారీ డిస్కౌంట్ ఆఫర్లు కల్పించారు. ద్విచక్రవాహనాలు, ఆటోలు చలాన్ మొత్తంలో 75 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. కార్లు, వ్యాన్, లారీ, హెవీ వెహికల్స్ కు చలాన్ మొత్తంలో 50 శాతం రాయితీ ప్రకటించారు. మాస్క్ చలాన్లపై కూడా భారీ తగ్గింపు ప్రకటించారు. మాస్క చలాన్లలో 90 శాతం రాయితీ ప్రకటించారు.
ఇప్పుడు ఇవి క్లియర్ చేయడానికి ఏ మీసేవ, ఈ సేవల దగ్గర క్యూలో నిల్చుంటాంలే అనుకోవద్దు. ఎందుకంటే ఆన్ లైన్ పేమెంట్ అవకాశం కల్పిస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ సేవల ద్వారా కూడా చెల్లించవచ్చు. అన్ని ఆఫర్లు ఇవ్వబట్టే నిమిషానికి 700 పెండింగ్ చలాన్లు క్లియర్ అవుతున్నాయి. ఇంకెందుకండి ఆలస్యం మీకేమైనా పెండింగ్ చలానాలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి. చక్కగా డిస్కౌంట్ ఆఫర్ లో కట్టేయండి. ఏ ట్రాఫిక్ పోలీసులు ఆపుతాడో అనే భయం లేకుండా దర్జాగా బైక్ పై తిరిగేయండి.
మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.