వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఇబ్బందికర ఘటన ఎదురైంది. పాదయాత్ర చేస్తున్న ఆవిడపై అకస్మాత్తుగా తేనెటీగల గుంపు దాడికి దిగింది. యాదాద్రి జిల్లాలోని మోట కొండూరు మండలం నుంచి పాదయాత్రగా ఆత్మకూరుకు వెళ్తున్నారు. దుర్గసానినపల్లి వద్ద చెట్టుకింద ఆగి, గ్రామవాసులతో ముచ్చటించారు. ఆ సమయంలో తేనెటీగల గుంపు ఒక్కసారిగా చెట్టుకింద ఉన్న షర్మిల బృందంపై దాడికి దిగాయి. ఆ దాడి నుంచి షర్మిల క్షేమంగా బయటపడ్డారు.
ఇదీ చదవండి: పంటను కాపాడేందుకు ఎలుగుబంటిని కాపలా పెట్టిన రైతు..!
ఆమె సెక్యూరిటీ సిబ్బంది కండవాలను తీసుకుని ఆవిడ చుట్టూ నిల్చున్నారు. కండువాలు ఊపుతూ అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు. ఆ దాడిలో పార్టీ కార్యకర్తలు కొందరికి గాయాలయ్యాయి. అక్కడ పరిస్థితి సద్దుమణిగిన తర్వాత షర్మిల పాదయాత్రను కొనసాగిస్తున్నారు. తేనెటీగల దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది. బుధవారంనాటికి షర్మిల పాదయాత్ర 34వ రోజుకు చేరుకుంది. షర్మిలకు ఎదురైన ఈ ఆందోళనకర ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
దురాసగాని పల్లిలో తేంటీగలు కొడుతున్న దైర్యంగా ముందుకు సాగిన @realyssharmila పాదయాత్ర. ఆ కుటుంభం అంతే . దేనికి భయపడరు. ప్రజలకోసం ఎందాకైనా, ఎంతకష్టమైన.. I.e.వైయస్ brand. #yssharmila @ANR1929 pic.twitter.com/LYCnQjrp3G
— Prabhakarreddy (@dprabhakarreddy) March 23, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.