మనిషిని నడిపించేది డబ్బే అంటారు. డబ్బు అంటే ఎలాంటి వ్యామెహం లేదని చెప్పినా డబ్బు సంపాదన రెట్టింపు చేసుకోవడం కోసం అహర్శశలూ కష్టపడుతూనే ఉంటారు. కొంతమండి డ్రైవర్లు, కండెక్టర్లు డబ్బులు పోగొట్టుకున్నవారి వివరాలు సేకించి మరీ తిరిగి వారి అప్పగించి తమ నిజాయితీని చాటుకుంటున్నారు.
మనిషి తన జీవితంలో డబ్బుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యకంగా చెప్పనక్కరలేదు. ఒక రకంగా చెప్పాంటే మనిషిని నడిపించేది డబ్బే అంటారు. పైకి డబ్బు అంటే ఎలాంటి వ్యామెహం లేదని చెప్పినా డబ్బు సంపాదన రెట్టింపు చేసుకోవడం కోసం అహర్శశలూ కష్టపడుతూనే ఉంటారు. రోడ్డు పై పది రూపాయలు కనిపించా గుట్టు చప్పుడు కాకుండా జేబులో వేసుకునే రోజులు ఇవి.. అలాంటిది ఓ బస్ కండెక్టర్ చేసిన పనికి అందరూ షెభాష్ అని మెచ్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మెదక్ వెళ్తున్న బస్సులో సంద్య అనే ఓ యువతి వెళ్తుంది. ఆమె నర్సాపూర్ పట్టణంలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగినిగా పని చేస్తుంది. ఆఫీస్ కి వెళ్లే కంగారులో తన ల్యాప్ ట్యాప్ బ్యాగ్ ని బస్సులోనే మర్చిపోయింది. అది గమనించిన కండెక్టర్ శోభారాణి నర్సాపూర్ బస్టాండ్ లోని ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించింది. ఈ క్రమంలో అధికారులు సంధ్యను పిలిపించి పొగొట్టుకున్న ల్యాప్ ట్యాప్ బ్యాగ్ ని ఆమెకు అందజేశారు. ఈ సంద్భంగా ఉద్యోగిని కండెక్టర్ శోభారాణి, ఆర్టీసీ అధికారులకు ధన్యవాదాలు తెలిపింది. ఉన్నతాధికారులు, తోటి ఉద్యోగులు కండెక్టర్ శోభారాణి ని అభినందించారు.
గతంలో పలువురు బస్ కండెక్టర్లు, డ్రైవర్లు బస్సులో పోగొట్టుకున్న వస్తువులు, పర్సులు, డబ్బులు బాధిత వ్యక్తులను పిలిచి అందజేసి తమ నిజాయితీని చాటుకున్నారు. ఆ మద్య లింగంపల్లి నుంచి ఉప్పల్ సర్వీస్ అందించే బస్ లో కండెక్టర్ గా పనిచేస్తున్న మధు కి పర్సు దొరికింది. కండెక్టర్ మధు పర్సు పొగొట్టుకున్న వ్యక్తి మురళీమోహన్ గా గుర్తించి అతనికి అప్పగించాడు. అందులో రూ.8 వేలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్‌లు, క్రెడిట్‌కార్డులు తదితర విలువైన కార్డులు ఉన్నాయి. కండెక్టర్ మధు నిజాయితీగా తన పర్సు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు మురళీమోహన్.