అతివేగం, నిర్లక్ష్య ధోరణి, మద్యం సేవించి వాహనాలు నడపటం రోడ్డు ప్రమాదాలకు కారణాలౌతున్నాయి. ఉద్యోగాలకు, పనుల మీద, ఇంటికి వచ్చేయాలన్న కంగారులో రోడ్లపై అతి వేగంతో దూసుకెళుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ట్రాఫిక్‌లో సైతం.. చిన్న చిన్న గ్యాపుల్లో కూడా దూసుకు వచ్చేస్తుంటారు బైకర్లు. ఇక కార్ల గురించి చెప్పనక్కర్లేదు. తాజాగా ఓ కారు భీభత్సం సృష్టించింది.
రోడ్డు ప్రమాదాల వల్ల జీవితం తల్లకిందులవుతుందని తెలిసి కూడా వాహనదారులు రయ్ రయ్ అని పోతుంటారు. అతివేగం, నిర్లక్ష్య ధోరణి, మద్యం సేవించి వాహనాలు నడపటం రోడ్డు ప్రమాదాలకు కారణాలౌతున్నాయి. ఇంట్లో తమను నమ్ముకుని తల్లిదండ్రులు, భార్యా బిడ్డలు ఉన్నారన్న ఆలోచన చేయకుండా ఉద్యోగాలకు, పనుల మీద, ఇంటికి వచ్చేయాలన్న కంగారులో రోడ్లపై అతి వేగంతో దూసుకెళుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ట్రాఫిక్‌లో సైతం.. చిన్న చిన్న గ్యాపుల్లో కూడా దూసుకు వచ్చేస్తుంటారు బైకర్లు. ఇక కార్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఖాళీ రోడ్ల నుండి రద్దీ రోడ్లపై కన్ను తెరిచి మూసేలోగా రేసింగ్ కార్లను మించిపోతుంటాయి. ఏటా ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. రోడ్డు భద్రతా వారోత్సాల పేరుతో అధికారులు చర్యలు తీసుకుంటున్నా.. పాటించేదీ ఆ వారమే. ఆ మరుసటి నుండి యథాతథం.
తాజాగా హైదరాబాద్‌లో ఓ కారు చేసిన భీభత్సం కారణంగా ఓ నిండు జీవితం ఆసుపత్రి పాలయ్యింది. తార్నాకలో ఓ బెంజ్ కారు.. రెండు ఆటోలను ఢీకొట్టి.. ఆగకుండా వేగంగా దూసుకు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ నెల 27న ఉదయాన్న ఓ బెంజ్ కారులో ఓ వ్యక్తి అత్యంత వేగంగా దూసుకెళుతున్నాడు. తార్నాక వద్ద ఓ ఆటోను బలంగా ఢీకొట్టాడు. ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. కారు ఢీ కొనడంతో ఆ ఆటో నడుపుతున్న దశరథ్ (70) అనే డ్రైవర్.. కిందపడ్డాడు. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో బెంజ్ కారు అతడి ఆటోను గుద్దిన తీరుతో మరో ఆటోను బలంగా ఢీకొంది. ఆ ఆటోలో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. అందులో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనపై పోలీసులు..హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేశారు. గాయపడ్డ థశరథ్‌ను స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా.. 24 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ పోలీసులు ఆ కారును గానీ, డ్రైవర్‌ను కానీ పట్టుకోకపోవటం గమనార్హం. ఇంకా గాలిస్తూనే ఉన్నామని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు థశరధ్ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశరథ్‌ది నిరుపేద కుటుంబం కాగా… రోజూ ఆటో నడుపుతూనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ పెద్దకు ఇలా కావటంతో.. కుటుంబసభ్యులకు ఏం చేయాల్లో తోచని పరిస్థితి. నిందితుడెవరో కనుగొని అరెస్టు చేయాల్సిన పోలీసులు జాప్యం చేస్తుండటంపై బంధువులు మండిపడుతున్నారు. బెంజ్ కార్ యజమానిని అరెస్టు చేయాలని, తమకు న్యాయం జరగాలని ఆవేదన వ్యక్తం చేశారు.