తెలంగాణలో గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తునే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ నేపద్యంలోనే జిల్లా కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక రానున్న రోజుల్లో కూడా వర్షాలు భారీగా పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలైన అసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇక గత వారం నుంచి కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. దీంతో అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. ఇక వరుస వర్షాల దాటికి రాష్ట్రంలోని వాగులు, వంకలు నిండి పొంగి పోతున్నాయి. దీంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ వంటి ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారిగా చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో రైతులు, మత్స్య కారులు జాగత్తగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు.