గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకులు నాగరత్న తెలిపారు.
తెలంగాణలో మరోసారి భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ఏర్పడటంతో తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు డే అవకాశం ఉందని.. ఆదివారం మరింత తీవ్రమయ్యే సూచనలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రెడ్ అలర్ట్ హెచ్చరిక చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పనులు అయితే మాత్రమే బయటకు రావాలని.. ఈ మేరకు నాగరత్న హెచ్చరించారు. శనివారం రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.