నిన్న రాత్రి నగరంలో భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటల పాటు కుండపోత వర్షం పడి కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి వర్షం అందుకుంది. సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతుంది. ఉప్పల్, బోడుప్పల్, తార్నాక, ఓయూ,అంబర్ పెట్ ఎల్బీనగర్ లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ ట్యాంక్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, మెహిదీపట్నం, చందానగర్, మియాపూర్ లోనూ వర్షం దంచికొడుతోంది.
భారీ వర్షంతో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. చాలా చో ట్ల నడుము లోతు నీళ్లు ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. క్రవారం కిందిస్థాయి గాలులు తూర్పు, ఈశాన్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్నట్టు తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం శుక్రవారం బలహీనపడినట్టు ఐఎండీ పేర్కొంది.
ఈనెల 10న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. నిన్న కురిసిన వర్షం నుంచే నగరం ఇంకా తేరుకోకపోగా, మరోసారి వర్షం పడడంతో నాలాలు ఉప్పొంగుతున్నాయి. దాంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.