హైదరాబాద్ లో గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో పలు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వర్షాల కారణంగా పటుచోట్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది.
గత మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తుంది. ఇప్పటికే వర్షాల కారణంగా విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. దీంతో రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణలోని 5 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక వర్షం కారణంగా హైదరాబాద్ లో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
గత మూడు రోజులుగా హైదరాబద్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో నగరంలో ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా డ్రైనేజీలు పొంగిపొర్లుగున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్థంబాలు కూలిపోయాయి.. దీతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వెళ్లే రహదారిలో రైల్వే బ్రిడ్జీ కింద భారీగా వర్షం నీరు వచ్చి చేరడంతో అటుగా వస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరంలో కురుస్తున్న వర్షం కారణంగా పలు చోట్ల భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీసులకు వెళ్లేవారు, చిరు వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదిలా ఉంటే గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసర పనులు ఉంటేనే ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాలని సూచిస్తున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్, మేయర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో సహాయ కార్యక్రమాల కోసం 9000113667 నెంబర్ లో సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, సిబ్బంది ఏమాత్రం అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు.
Heavy rainfall is expected to continue over the Hyderabad city today.Please stay indoors and avoid travel to extent possible. Citizens may dial 9000113667 for assistance. @KTRBRS @arvindkumar_ias @GadwalvijayaTRS @CommissionrGHMC pic.twitter.com/e5gGipX3Qg
— Director EV&DM, GHMC (@Director_EVDM) July 20, 2023