హైదరాబాద్ పరిధిలో వర్షం భారీగా కురుస్తోంది. వర్షానికి గ్రేటర్ హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయాయి. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో నగరవాసులు నానా అవస్థలు పడుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, శేర్లింగంపల్లి, కొండాపూర్, బోరబండ, చందానగర్, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. సాంయంత్రం నుంచే వర్షం పడుతుండటంతో ఉద్యోగులు, కూలీలు ఇళ్లకు వెళ్లేందుకు నానా తిప్పలు పడుతున్నారు.
కూకట్ పల్లి ప్రాంతంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కాలనీలు నీటమునిగాయి. హైదరాబాద్ నగరంలోనే కాకుండా.. శివారు ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. రంగారెడ్డి నార్సింగి, గండిపేట, కోకాపేట, పుప్పాల్ గూడా, బండ్లగూడ జాగీర్ వంటి ప్రాంతాల్లోనూ జోరుగా వర్షం కురుస్తోంది. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ అధికారులు ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైదని వివరాలను వెల్లడించారు. నగరంలో అత్యధికంగా జూబ్లీహిల్స్ లో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చందానగర్ లో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Every time after heavy rain this road under PVNR Expressway turns into rivulet, today also same #Waterlogging due to #heavyrains at #Upperpally near #Attapur area in #Hyderabad, traffic interrupts. #HyderabadRains #Telanganarains #HeavyRain pic.twitter.com/tsEOcwOoKO
— Surya Reddy (@jsuryareddy) October 8, 2022
Heavy Rain in Hyderabad 🌧️ Since Three Hours.#HyderabadRains #WeatherUpdate @HiHyderabad @swachhhyd @TelanganaToday @KTRTRS @arvindkumar_ias @GHMCOnline @Director_EVDM @APWeatherman96 @Rajani_Weather @balaji25_t @DDYadagiri @TOIHyderabad @TelanganaCOPs @HyderabadMojo pic.twitter.com/lHfXS6wbnB
— Kavali chandrakanth (@Kavalichandrak1) October 8, 2022