ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పలు చోట్ల ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ లోనే ఇంత ఎండలు కొడితే.. ఇక మే నెలలో పరిస్థితి ఏంటో అని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలలో ఎండలు దంచికొడతాయి. భానుడి ప్రతాపానికి తట్టుకోలేక ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. కాస్త నీడ దొరికితే వెంటనే అక్కడికి చేరుకుంటారు. శీతల పానియాల వైపు మొగ్గు చూపుతుంటారు. గత కొద్దిరోజులుగా ఎండలు మండుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. మరికొన్ని రోజుల పాటు ఎండలు, వడగాలులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆందోనళ చెందుతున్నారు. ఇదిలా ఉంటే గత నెల నుంచి అప్పుడప్పుడు వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు వస్తున్నాయి.. ఆకాశం మేఘావృతం అవుతుంది.. అకాల వర్షం పడుతుంది. తాజాగా హైదరాబాద్ లో వడగండ్ల వాన కురిసింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా ఎండలు మండుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. సోమవారం ఉదయం ఎండలు భగ భగ మండాయి. సాయంత్రం అకస్మాత్తుగా వాతావరణంలో మార్పు వచ్చింది.. ఈదురు గాలులు తో కూడిన వర్షం పడింది. అనేక చోట్ల వడగళ్లతో కూడి వర్షం పడింది. అబిడ్స్, కోఠీ, సుల్తాన్ బజార్, బేగంబజార్, లిబర్టీ, నారాయణ గూడ, గోషామహాల్, హిమాయత్ నగర్, లక్డీకపూల్ తదితర ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది. ఇక చంచల్ గూడ, హైదర్ గూడ, సైదాబాద్, చంపాపేట్ పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడి వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ ఒక్కసారిగా జలమయం అయ్యాయి. వాహనదారులు ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు పడ్డారు.
గత రెండు మూడు రోజులుగా ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు.. పలు చోట్ల ఏకంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సోమవారం పది గంటల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపించాడు.. అయితే సాయంత్రానికి వాతావరణం ఒక్కసారే చల్లబడటంతో కాస్త ఉపశమనం లభించినట్లయ్యింది. రానున్న మూడు రోజుల పాటు హైదరాబాద్ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల వడగండ్ల వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వడగండ్ల వానకు పలు వాహనాలు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలు వర్షంతో నిండిపోయి.. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.