తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో గత మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో పలు చోట్ల ఉరుములు.. మెరుపులతో కూడిన వర్షాలు కురియడంతో లోతట్టు ప్రాంతాల్లు జలమయం అయ్యాయి. ప్రజలు బయటకు రావొద్దని
తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మూడు రోజులుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. నల్లని మేఘాలు కమ్ముకున్నాయి.. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ జిల్లాల్లో పలు చోట్ల మరో రెండు రోజుల వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో గత మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. మొన్నటి నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈ వర్ష ప్రభావం రేపు, ఎల్లుండి ఉండబోతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో కురిసిన కుండపోత వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజేంద్ర నగర్, చాంద్రాయణ గుట్ట లో నిన్న భారీ వర్షాలు కురియడంతో భారీగా వరద నీరు చేరుకుంది. పలు చోట్ల కాలువులు పొంగిపొర్లుతున్నాయి. కూకట్ పల్లి, జేఎన్టీయూ, నిజాం పేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, మియాపూర్, చందానగర్, పటాన్ చెరు పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
భారీ వర్షాల కారణంగా ఖైరతాబాద్, పంజాగుట్ట, బైగం పేట, హైటెక్ సిటీ ప్రాంతాల్లో భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల వడగళ్ల వాన కురియడంతో రైతులు లబోదిబో అంటున్నారు. హైదరాబాద్ లో శనివారం సాయంత్రం నుంచి ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. బయటకు వెళ్లరాదని అవసరం అయితేనే ప్రయాణాలు చేయాలని.. లోతట్టు ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు భారీ వర్ష సూచనలు ఉండటంతో అధికారులు అప్రమత్తయ్యం అయ్యారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు జిల్లాల్లో రైతులకు పంట నష్టం సంభవించింది.
Scary pic.twitter.com/ZuATJqtIrL
— YATHI®️ (@ursyathi) March 18, 2023
Life lo 1st time ee range vadagalla vaana chudatam pic.twitter.com/G2Iwx0row1
— R a J i V (@RajivAluri) March 18, 2023
Hailstorm in Kukatpally of #Hyderabad pic.twitter.com/C3VmFAiQSk
— B Kartheek (@KartheekTnie) March 18, 2023
Hailstorm in #Kukatpally #Hyderabad #HyderabadRains #HailstormInHyderabad #Hailstorm Stay safe guys pic.twitter.com/NSmmB03GOt
— Revathi (@revathitweets) March 18, 2023