తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. మొన్నటి మొన్న ఓ 13 ఏళ్ల బాలిక అప్పటి వరకు స్నేహితులతో ఆడుకుని, ఇంటికి వచ్చి నిద్రపోయింది. పొద్దునే తేలుస్తూ గుండె పోటుతో మరణించింది. ఇప్పుడు మరో యువకుడు ఆడుతూ ఆడుతూ కుప్పకూలిపోయాడు.
గుండె బలహీనపడుతోంది. చిట్టి గుండె మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. పెద్ద వారిలోనే కాకుండా చిన్న పిల్లల ఉసురు తీస్తోంది. ఆరోగ్యంగా ఉన్న వారిలో కూడా గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పెరుగుతున్నాయి. మొన్నటి మొన్న ఓ 13 ఏళ్ల బాలిక అప్పటి వరకు స్నేహితులతో ఆడుకుని, ఆదమరిచి నిద్రపోయింది. తెల్లవారు జామున లేస్తుండగానే గుండె పోటుకు గురై చనిపోయింది. ఈ బాలికే కాదూ మూడు నెలల కాలంలో అనేక మంది హార్ట్ స్ట్రోక్‌తోనే అకాల మరణం చెందారు. తాజాగా ఇప్పుడు మరో యువకుడు క్రికెట్ ఆడుతుండగా మృతి చెందాడు.
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో అపశృతి చోటుచేసుకుంది. హుస్నాబాద్‌లో కేఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్‌లో విషాదం నెలకొంది. ఆంజనేయులు అనే వ్యక్తి క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి క్రీడాకారులు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుప్రతికి తరలించగా అప్పటికే చనిపోయినట్ల వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని భోరున విలపించారు. కొన్ని రోజుల నుండి ఈ టోర్నమెంట్ జరుగుతుండగా.. క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు ఆంజనేయులు. ఆడుతూ ఆడుతూ ఒక్కసారిగా పడిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా కార్డియాక్ అరెస్టుతో అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.