జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో ఓ యువకుడు మరణించాడు. అతడికి అంత్యక్రియలు నిర్వహిస్తుండగానే అతని అన్న కూడా అదే రోజు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతని కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పలితం లేకపోవడంతో మార్గమధ్యలోనే ఆ యువకుడు ప్రాణాలు విడిచాడు. ఒకే రోజు వ్యవధిలో అన్నదమ్ములు గుండెపోటుతో మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
జిగిత్యాల జిల్లాలోని మెట్ పల్లి గ్రామం. ఇక్కడే శ్రీనివాస్ (32), సచిన్ (35) అనే అన్నదమ్ములు ఉండేవారు. తమ్ముడు శ్రీనివాస్ ఉన్నత చదువులు పూర్తి చేసి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇకపోతే శనివారం ఉన్నట్టుండి శ్రీనివాస్ గుండెపోటుతో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. చేతికందిన కుమారుడు ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోవడంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మరీ ముఖ్యంగా తమ్ముడు మరణించడంతో అన్న సచిన్ తట్టుకోలేకపోయాడు.
అయితే శ్రీనివాస్ కు అంత్యక్రియలు నిర్వహిస్తుండగానే అన్న సచిన్ గుండెపోటుతో ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన సచిన్ కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోవడంతో సచిన్ మార్గమధ్యలోనే గుండెపోటుతో మరణించాడని వైద్యులు నిర్దారించారు. ఈ విషయం తెలుసుకున్న సచిన్ తల్లిదండ్రులు మరోసారి గుండెలు పగిలేలా ఏడ్చారు. ఒకే రోజు వ్యవధిలో అన్నదమ్ములు గుండెపోటుతో మృతిచెందడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.