ప్రేమించాడు.. పెద్దలను ఒప్పించాడు. తాను మెచ్చిన అమ్మాయితో తెల్లారితే పెళ్లి.. ఇల్లంతా సందడి నెలకొంది. ఇంకొన్ని గంటల్లోనే పెళ్లి. అంతలోనే పెళ్లి కుమారుడి కోసం వెతకగా.. కనిపించలేదు. వెతికారు.. అయినా జాడ లేదు. చేసేదేమీ లేక పెళ్లి దుస్తుల్లోనే పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది యువతి.
ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు నానా తంటాలు పడుతుంటాడు ప్రేమికుడు. అటు అమ్మాయి తల్లిదండ్రుల్ని ఒప్పించుకుని, ఇటు తన తల్లిదండ్రుల్ని మెప్పించుకునేందుకు అబ్బాయి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వారు ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకోవడాలు.. లేదంటే బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం చేస్తుంటారు. ప్రేమించాడు.. పెద్దలను ఒప్పించాడు. తాను మెచ్చిన అమ్మాయితో తెల్లారితే పెళ్లి.. ఇల్లంతా సందడి నెలకొంది. ఇంకొన్ని గంటల్లోనే పెళ్లి. అంతలోనే పెళ్లి కుమారుడి కోసం వెతకగా.. కనిపించలేదు. దీంతో కంగారు పడ్డారు వధువు, వరుడి తల్లిదండ్రులు. అంతా వెతికారు.. అయినా జాడ లేదు. చేసేదేమీ లేక పెళ్లి దుస్తుల్లోనే పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది యువతి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారనం.. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలోని కుత్బుల్లాపూర్‌కు చెందిన కేసం అనిల్, స్వాతిలు ప్రేమించుకున్నారు. పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఫిబ్రవరి 19న ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం పెద్దలకు తెలిసింది. పిల్లల ప్రేమను కాదనలేక..వీరికి మళ్లీ పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అందులో భాగంగా మార్చిలో ఘనంగా ఎంగేజ్ మెంట్ చేసి, మే 3న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు పెద్దలు. మే 3న పెళ్లి అనగా.. ముందు రోజు రాత్రి నుండి వరుడు కనిపించకుండా పోయాడు.
ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వస్తుంది. దాంతో అమ్మాయి తల్లిదండ్రులు కుత్బుల్లాపూర్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.కేసు నమోదు చేసి, రంగంలోకి దిగిన పోలీసులు.. అనిల్‌ను నాలుగు గంటల్లో పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దాంతో అనుకున్న సమయానికే పెళ్లి జరిపించారు. అయితే.. కులం సాకుతో పెళ్లి నుంచి తప్పించుకోవాలని అనిల్ ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. మొత్తం మీద అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిగేలా చూసిన పోలీసులకు అమ్మాయి తరఫు బంధువులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.