ధి కొందరి జీవితాల్లో విస్తుపోయే సంఘటనలు సృష్టించి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తోంది. ఓ వ్యక్తి విషయంలో అదే జరిగింది. అతడు ఓ గ్రామానికి సర్పంచ్. అభివృద్ధి పనుల్లో భాగంగా శ్మశాన వాటికను కట్టించాడు. అయితే ఏ మూహుర్తంలో దాన్ని కట్టించాడో కానీ
మృత్యువు ఎలా ముంచుకొస్తుందో ఊహించడం కష్టం. కొంత మంది ఆత్మహత్యలు చేసుకుని బలవన్మరణాలకు పాల్పడితే, మరికొందరు ప్రమాదాల్లో, ఇంకొంత మంది అనారోగ్య సమస్యలతో చనిపోతున్నారు. అయితే విధి రాతను ఎవ్వరూ తిరిగి రాయలేం. కానీ ఈ విధి కొందరి జీవితాల్లో విస్తుపోయే సంఘటనలు సృష్టించి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తోంది. ఓ వ్యక్తి విషయంలో అదే జరిగింది. అతడు ఓ గ్రామానికి సర్పంచ్. అభివృద్ధి పనుల్లో భాగంగా శ్మశాన వాటికను కట్టించాడు. అయితే ఏ మూహుర్తంలో దాన్ని కట్టించాడో కానీ అతడినే తొలిసారిగా పిలిచింది ఆ శ్మశాన వాటిక. వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన జరిగింది తెలంగాణలోనే.
ఓ గ్రామ సర్పంచ్ కట్టించిన శ్మశాన వాటికలో.. అతడివే మొదటి దహన సంస్కారాలు కావడం గమనార్హం. ఈ దురదృష్టకర ఘటన హన్మకొండ జిల్లా పరకాల మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. హైబోత్పల్లి గ్రామ సర్పంచ్ కంచ కుమారస్వామి(35)కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అయితే ఇదే విషయంపై భార్య అతడితో గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రావాలని కోరగా.. ససేమిరా అనడంతో మనస్థాపానికి గురైన సర్పంచ్.. శనివారం పురుగుల మందు తాగాడు. తర్వాత తన పెద్ద కొడుక్కి సమాచారం ఇచ్చాడు. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు.
కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటులో భాగంగా వెంకటాపురం శివారు గ్రామం హైబోత్పల్లి ఏర్పడడంతో గ్రామస్తులు కుమారస్వామిని ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. దీంతో గ్రామాభివృద్ధి కోసం కష్టపడ్డాడు. ఇందులో భాగంగా శ్మశాన వాటిక, డంప్ యార్డ్ కట్టించాడు. వివిధ అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.24 లక్షల వరకు అప్పు చేశాడని సమాచారం. అయితే ఆ బిల్లులు రాలేదని అందుకే అప్పుల పాలయ్యాడని గ్రామస్తులంటున్నారు. ఈ క్రమంలో కుటుంబంలో గొడవలు జరిగి భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. అతడి కుటుంబసభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.