ప్రేమ అనే మత్తులో మునిగి తేలుతున్న యువత..క్షణికంలో శారీరకంగా దగ్గరవుతున్నారు. ప్రేమించిన వ్యక్తి .. హామీల రూపంలో ఉన్న మాయ మాటలు నమ్మిన యువతి.. సర్వస్వం అప్పగిస్తుంది. ఆమె కడుపున ఓ కాయ పడ్డాక.. పెళ్లి చేసుకోమని అడిగితే, ప్రియుడు మొహం చాటేస్తున్నాడు. భార్గవి కూడా అలా నమ్మి మోసపోయింది. తీరా బిడ్దకు జన్మనివ్వగా..
నేడు ప్రేమ.. కామ వాంఛకు మాత్రమే దారి తీస్తుంది. ప్రేమ అనే మత్తులో మునిగి తేలుతున్న యువత..క్షణికంలో శారీరకంగా దగ్గరవుతున్నారు. ప్రేమించిన వ్యక్తి .. హామీల రూపంలో ఉన్న మాయ మాటలు నమ్మిన యువతి.. సర్వస్వం అప్పగిస్తుంది. ఆమె కడుపున ఓ కాయ పడ్డాక.. పెళ్లి చేసుకోమని అడిగితే, ప్రియుడు మొహం చాటేస్తున్నాడు. అప్పటి వరకు గుర్తుకు రాని కారణాలను ఆమె ముందు ఉంచుతాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి.. తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం బతుకుతుందీ లేదంటే కన్నవాళ్లకు పరువు పోకూడదన్న ఉద్దేశంతో ఇంట్లో నుండి వెళ్లిపోవడమో లేదంటే అఘాయిత్యాలకు పాల్పడటమో చేస్తుంది. ఇలా చాలా మంది అమ్మాయిలు ప్రేమ వలలో చిక్కుకుని మోసపోయిన ఘటనలు ఎన్నో. భార్గవి కూడా అలా ఓ యువకుడిని నమ్మి.. ఓ బిడ్డకు తల్లైంది. తీరా అతడు..
రెండేళ్లు ప్రేమించాడు. నువ్వు లేకపోతే జీవించలేనన్నాడు. చనిపోతానంటూ లొంగదీసుకుని.. కాపురం పెట్టాడు. వదిలేశాడు. తన జీవితం తాను బతికేందుకు మరో పెళ్లికి సిద్ధమైన సమయంలో మళ్లీ ఆమె జీవితంలోకి వచ్చి బిడ్డకు తండ్రయ్యాడు. మళ్లీ వదిలేశాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రామ్ శివాజీ నగర్‌కు చెందిన భార్గవిని తన ఇంటి పక్కనే ఉండే మణికంఠ ప్రేమించాడు. నువ్వు ప్రేమించకపోతే చస్తానంటూ బెదిరించి.. సహజీవనం చేశాడు. మా ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకోవడం లేదని ఆపై వదిలేశాడు. ఇక తన బతుకు తాను బతకాలని నిర్ణయం తీసుకున్న సమయంలో తల్లిదండ్రులు చూసిన పెళ్లి సంబంధాన్ని ఒప్పుకొని పెళ్లికి సిద్ధమైంది భార్గవి.
వివాహానికి రెండు రోజుల ముందు వచ్చిన మణికంఠ.. వేరో పెళ్లి చేసుకుంటే ఫోటోలు, వీడియోలు ఉన్నాయని అవన్నీ బయటపెడతానని బెదిరించాడు. ఏమీ చేసేదీ లేక ఇంట్లో వాళ్లు కుదిర్చిన పెళ్లి కాదని, అతడితో వెళ్లిపోయింది. మొదట వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్‌లోనూ పెళ్లి చేసుకున్నారు. కాపురం పెట్టారు. కొన్ని నెలలు వాళ్ల కాపురం సాఫీగా సాగింది. అయితే భార్గవికి ప్రెగ్నెంట్ అని తెలియడంతో అబార్షన్ చేసుకోమని ఆమెను ఇబ్బందులకు గురి చేశాడు. ఆమె ససేమిరా అనడంతో ఆమెను వారి తల్లిదండ్రుల ఇంటి వద్ద వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్లాడు. భార్గవి డెలివరీ అయ్యి పాపకు జన్మనిచ్చింది. పాప పుట్టి 15 నెలలు గడుస్తున్నా రాలేదు. ఫోన్లో సంప్రదించగా అసభ్య పదజాలంతో తిట్టడం మొదలు పెట్టాడు.
‘నీవు నాకు అవసరం లేదు, నీ కూతురు నాకు అవసరం లేదు.. ఏం చేసుకుంటావో చేసుకో.. నీకు నాకు సంబంధం లేదని’ అని చెప్పాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ చంటి బిడ్డతో పెట్రోల్ క్యాన్ పట్టుకొని మణికంఠ ఇంటి ముందు టెంట్ వేసుకొని నిరసన దీక్ష చేపట్టింది భార్గవి. ఆమెకు మహిళ సంఘాలు అండగా నిలిచాయి. తనకు న్యాయం చేయాలని.. లేకుంటే కూతురుతో కలిసి మణికంఠ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించింది. ఈ విషయం పోలీసులకు చేరింది. ఆలేరు ఎస్సై ఇద్రిస్ అలీని వివరణ కోరగా.. గతంలో మణికంఠకు పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా తన ప్రవర్తన మార్చుకోవడం లేదని, ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిచినా రావటం లేదని మరోసారి పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు.