ఖమ్మం యువకుడు, డాక్టర్ హర్షవర్ధన్ మరణం పట్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, నెటిజన్స్ అందరూ భావోద్వేగానికి గురవుతున్నారు. అతని గురించి చదువుతుంటే, వింటుంటే ఇంత మంచి మనిషా అని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అంతలా అందరి హృదయాలను గెలుచుకున్న హర్షవర్ధన్ గురించి అతని స్నేహితురాలు సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చనిపోయే ముందు తనకు కాల్ చేశాడని.. కానీ లిఫ్ట్ చేయలేదని ఆమె బాధపడ్డారు.
అందరి కళ్ళలో నీళ్లు తిరిగేలా చేసిన డాక్టర్ హర్షవర్ధన్ గురించి ఎవరినీ కదిపినా చాలా మంచి మనిషి అని అంటున్నారు. అందరితో బాగా కలిసి పోయేవాడని.. అందరి పట్ల ప్రేమగా వ్యవహరించేవాడని.. సాయం అడిగితే చేసే వ్యక్తిత్వం తనదని చెబుతున్నారు. తాజాగా హర్షవర్ధన్ గురించి ఆమె స్నేహితురాలు ప్రవీణ సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. హర్ష గురించి మాట్లాడుతూ లైవ్ లోనే కన్నీళ్లు ఏడ్చేశారు. తనకు హర్ష చాలా మంచి ఫ్రెండ్ అని, తనకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాడని ఆమె అన్నారు. తన పేరు ప్రవీణ అయితే తనొక్కడే వీణ అని పిలుస్తాడని.. కానీ ఇప్పుడు అలా పిలిచే హర్ష లేడని ఆమె ఏడ్చేశారు.
ప్రవీణ ఇండియాలో ఓ ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్నారు. అయితే క్యాన్సర్ అని తెలిసాక హర్షవర్ధన్ ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చాడని.. అప్పుడు ఒక్కసారి తమని మీట్ అవ్వమని విజయ్ అనే ఫ్రెండ్, తాను అందరం హర్షను ఎంతగానో రిక్వస్ట్ చేశామని అన్నారు. మేము ఆస్ట్రేలియా రావడం కుదరదని, ప్లీజ్ కలవరా హర్ష అని అన్నా గానీ హర్ష మాత్రం కలవలేదని బాధపడ్డారు. మీరు నన్ను ఈ పరిస్థితుల్లో చూడలేరు అని.. చూస్తే బాధపడతారు అని చెప్పి కలవలేదని బాధపడ్డారు. హర్ష చాలా మంచి మనిషి అని, ధైర్యంగా ఉంటాడని తెలుసు గానీ చావుకు ముందే ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకునేంత ధైర్యం ఉంటుందని అనుకోలేదని ఆమె ఎమోషనల్ అయ్యారు.
మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లి చాలా బాధపెట్టాడని, మార్చి మొదటి వారంలో తనకు కాల్ చేస్తే కొంతసేపు మాట్లాడాడని.. మే నెలలో తన తమ్ముడి పెళ్ళిలో మిమ్మల్ని కలుస్తానని తమతో అన్నాడని అన్నారు. ఆ సమయంలో తన ఆరోగ్యం గురించి అడిగితే.. బానే ఉందని, మందులు వేసుకుంటున్నా అని చెప్పాడని ఆమె అన్నారు. కానీ ఇలా మళ్ళీ చూడలేనంత దూరం వెళ్ళిపోతాడని ఊహించలేకపోయామని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడని.. ముఖంలో చిరునవ్వుని కోల్పోడని అన్నారు. ఎంత బిజీలో ఉన్నా సరే ఫోన్ లిఫ్ట్ చేయాలన్న పాఠాన్ని తనకు నేర్పించాడని.. తను కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి ఉంటే తనతో ఆఖరి సారిగా మాట్లాడేదాన్నేమో అంటూ బాధపడ్డారు. ఇంకా హర్షవర్ధన్ గురించి ఎన్నో విషయాలు చెప్పిన వీడియో కింద ఉంది చూడగలరు.