దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతిని భక్తులు వైభవంగా జరుపుకుంటున్నారు. ఆంజనేయుడి ఆలయాలను సందర్శిస్తున్నారు. హనుమాన్ శోభాయాత్రలు కూడా చాలాచోట్ల మొదలయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవుళ్లుగా వినాయకుడు, హనుమంతుడి గురించి చెబుతారు. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయుడు తప్పకుండా ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ రోజు చైత్ర మాసంలో శుద్ధ పౌర్ణమినాడు హనుమంతుడు పుట్టినటువంటి పవిత్రమైన రోజు. అందుకే దేశవ్యాప్తంగా భక్తులందరూ ఆంజనేయుడి గుళ్లకు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో హనుమంతుడి ఆలయాలు కిటకిటలాడాయి. అలాగే దేశంలోని చాలా చోట్ల ఇవాళ హనుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్లో కూడా హనుమాన్ శోభాయాత్ర నేపథ్యంలో పోలీసులు భారీ బందోస్తును ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా ర్యాలీలు, కర్మన్ఘాట్ నుంచి గౌలిగూడ మీదుగా సికింద్రాబాద్ నుంచి తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు భారీ ర్యాలీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా.. చందానగర్లో హనుమాన్ శోభాయాత్రలో చోటుచేసుకున్న ఓ ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. శోభాయాత్రలో పాల్గొన్న యువకులకు ముస్లిం సోదరులు మజ్జిగ అందజేశారు. మతసామరస్యాన్ని చాటే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hanuman Jayanti 2023: హనుమాన్ శోభాయాత్రలో ముస్లిం సోదరుల సేవలు.. మతసామరస్యం అంటే ఇదే కదా! pic.twitter.com/TVQS7kp0kV
— Rajasekhar (@Rajasek61450452) April 6, 2023