ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో గన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా కొంతమంది అక్రమార్కులు బీహార్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర నుంచి అక్రమంగా ఆయుదాలు సరఫరా చేస్తున్నారు. అక్రమాయుధాలతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నేరాలు చోటుచేసుకుంటున్నాయి. గ్యాంగ్ వార్స్, రియలెస్టేట్ గొడవలు, సెటిల్ మెంట్స్ లో గన్ కల్చర్ పెరిగిపోతుంది.
ఇటీవల దేశ వ్యాప్తంగా గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. కొంతమంది కేటుగాళ్లు బీహార్, ఉత్తర్ ప్రదేశ్, ముంబాయి నుంచి అక్రమంగా ఆయుధాలను తీసుకు వచ్చి లోకల్ గ్యాంగ్ స్టర్స్ కి అమ్ముతున్నారు. లైసెన్స్ లేని గన్స్ తో రౌడీ షీటర్స్ రెచ్చిపోతున్నారు.. పలు చోట్ల కాల్పులు జరుపుతూ భయాందోళన సృష్టిస్తున్నారు. ఎక్కువగా గ్యాంగ్ వార్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారుల మద్య గొడవలు, సెటిల్ మెంట్స్ వాటిలో గన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. తాజాగా కరీంనగర్ లో కాల్పులు కలకలం రేపాయి. వివరాల్లోకి వెళితే..
కరీంనగర్ జిల్లా మానకొండూరు లో కాల్పులు కలకలం రేపాయి. బుధవారం అర్థరాత్రి గ్రామానికి చెందిన బాశబోయిన అరుణ్ యాదవ్ అనే రౌడీషీటర్ పై మరో నలుగురు రౌడీషీటర్లు కాల్పులు జరిపారు. అరుణ్ యాదవ్ ఇంట్లో జొరపడి అతడిపై దాడి చేశారు.. అతడు తప్పించుకుంటున్న సమయంలో ఫైరింగ్ చేశారు. అదృష్టం కొద్ది అరుణ్ యాదవ్ ఫైరింగ్ నుంచి గప్పించుకున్నాడు. దగ్గరలోని ఓ ఇంట్లోకి చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. కోపంతో దుండగులు రెచ్చిపోయారు.. ఇంట్లో సామాన్లు ధ్వంసం చేశారు.. అరుణ్ జాడ చెప్పమని అతని కూతురు వైష్ణవిపై దాడి చేశారు. అంతేకాదు అరుణ్ పక్కింటికి వెళ్లి ఉంటాడని భావించి రోల్ల మల్లయ్య అనే ఇంట్లోకి వెళ్లి అక్కడ కూడా సామాన్లు ధ్వంసం చేశారు.
ఈ దాడిలో అరుణ్ తో పాటు మరో ఎనిమిదిమందికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వాళ్లందరిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అరుణ్ పై దాడి చేసిన నలుగురిలో ఇద్దరిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దుండగుల్లో ఒకరు తమను తుపాకీతో బెదిరించారని స్థానికులు తెలిపారు. గతంలో అరుణ్ యాదవ్ పై కరీంనగర్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ నమోదు అయ్యింది. పారిపోయిన మరో ఇద్దరి కోసం గాలింపులు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. దుండగులకు నేర చరిత్ర ఉందని.. పాత కక్ష్యలే ఈ ఘటనకు కారణం అని అన్నారు. కేసు నమోదు చేసుకొని మానకొండూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారే కాల్పుల మోత మోగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.