'కట్నం అడిగిన వాడు గాడిద..' ఈ వ్యాఖ్యం ఓ టీవీ ఛానల్ లో ప్రతి ఐదు నిమిషాలకోసారి స్క్రోలింగ్ గా వస్తూనే ఉంటుంది. కట్నం అడిగిన వాడు మనిషి కాదని దీనర్థం. అలాంటిది ఓ వరుడు.. కట్నం కింద బైక్ కొనివ్వలేదని వధువు మెడలో తాళి కట్టనని మొండికేశాడు. ఈ ఘటన మన తెలంగాణ రాష్ట్రంలోనే చోటుచేసుకుంది.
నేటి ఆధునిక యుగంలో కూడా ఆడపిల్లల తల్లిదండ్రులకు వరకట్న సమస్యలు ఏమాత్రం తగ్గడం లేదు. పెళ్లి అయ్యాక అదనపు కట్నం కోసం భార్యను వేధించేవారు కొందరైతే, పెళ్లి పీటల మీదనే ఎంత పెడతావో చెప్పమని డిమాండ్ చేసేవారు మరికొందరు. అలానే ఓ పెళ్లి కొడుకు బైక్ కట్నంగా ఇస్తే గానీ మూడు ముళ్లు వేయనని మొండికేశాడు. అయితే, అదే పెళ్ళికి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆ వరుడి కోరిక తీర్చడంతో పెళ్లి సజావుగా సాగింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో చోటుచేసుకుంది.
శంకరపట్నం మండలం అంబాల్పూర్ మాజీ సర్పంచ్ గాజుల లక్ష్మీ – మల్లయ్యదంపతుల కుమార్తె అనూష వివాహం సైదాపూర్ మండలం వెన్నెంపల్లి గ్రామానికి చెందిన సంఘాల వినయ్ అనే యువకుడితో నిశ్చయించారు. ఆ సమయంలో కట్నం కింద రూ.5 లక్షల నగదుతో పాటు బైక్ కొనిస్తామని వధువులు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులది నిరుపేద దళిత కుటుంబం అయినప్పటికి అప్పోసప్పో చేసి వరుడి ఇంటి వారికి పెళ్ళికి ముందే రూ.5 లక్షలు ముట్టజెప్పారు. శుక్రవారం మొలంగూరు శివారులోని లక్ష్మీప్రసన్న ఫంక్షన్‌హాల్‌లో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ పెళ్ళికి హాజరవ్వాల్సిందిగా మానుకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వివాహ వేడుకకు హాజరయ్యారు.
అయితే తీరా తాళికట్టే సమయానికి మామ తనకు బైక్ కొనివ్వలేదని వరుడు అలిగాడు. బైక్ కొనిస్తేనే తాళి కడతానని మొండికేశాడు. ఇప్పటికిప్పుడు బైక్ అంటే ఏడ తెవాల్నని పెళ్లికూతరు తల్లిదండ్రులు, పెళ్లికి వచ్చిన బంధుమిత్రులు ఎంత నచ్చజెప్పినా పెళ్లికొడుకు తాళి కట్టేందుకు ససేమిరా అన్నాడు. ఈ గొడవను కళ్లారా చూసిన ఎమ్మెల్యే రసమయి.. పెళ్లి కొడుకుతో మాట్లాడి నచ్చజెప్పారు. బైక్ కు కావాల్సిన రూ.లక్ష వరుడు చేతిలో పెట్టి.. వధువు మెడలో తాళికట్టించారు. పెళ్లిని సజావుగా జరిపించిన ఎమ్మెల్యేకు వధూవరులిద్దరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కృతజ్ఞతలు తెలిపారు. రసమయి ఔదర్యం పట్ల ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈ వరుడిపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
బైక్ కోనివ్వలేదని ఆగిన పెళ్లి.. బైక్ కోసం డబ్బులిచ్చి పెళ్లి జరిపించిన ఎమ్మెల్యే రసమయి
బైక్ కొనివ్వలేదని ఓ పెళ్ళి కొడుకు ఏకంగా పీటల మీద పెళ్లి ఆపి.. పెళ్లి కూతురుకు కన్నీళ్లు పెట్టించిన ఘటనను కళ్ళారా చూసిన మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.
బైక్ లక్ష రూపాయల నగదు ఇచ్చి… pic.twitter.com/u1nF7m4HcN
— Telugu Scribe (@TeluguScribe) May 12, 2023