ఎక్కడైనా ఫ్రీగా ఏదైనా వస్తువు దొరికితే జనాలు అక్కడి ఎగబడి మరీ వెళ్తుంటారు. కొన్ని సార్లు లిక్కర్, పాలు, చేపలు, పండ్లు రక రకాల వస్తువులు లోడ్ చేసుకొని వెళ్తున్న లారీలు, వ్యాన్లు ఫల్టీ కొట్టడంతో రోడ్డు పాలు అవుతుంటాయి.. ఈ విషయం చుట్టు పక్కల గ్రామాలకు తెలిస్తే అందినంత వరకు తీసుకు వెళ్తు లూటీ చేస్తుంటారు.
చివ్వెంల మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా తో వెళ్తున్న బోల్తా పడింది. ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నడీసీఎంకి ఎదురుగా బైక్ అడ్డురావడం తో బ్రేక్ కొట్టగా డీసీఎం పల్టీ కొట్టింది. అయితే ద్రాక్ష పళ్లను ఏరుకునేందుకు జనాలు ఎగబడ్డారు. అయితే ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ కి ఎలాంటి గాయాలు కాలేదు.
ఆ సమయంలో జనాలను వారు ఎంత వారించినా వినకుండా తమ పని తాము చేసుకుంటూ పోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పుణ్యానికి వస్తే పినాయిల్ కూడా వదలరు.. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.