పరీక్షల కాలం. ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు కూడా పరీక్షలే. ఈ విద్యా సంవత్సరానికి ఫైనల్ పరీక్షలు కావడంతో పిల్లల్ని చదివించేందుకు కుస్తీలు పడుతుంటారు తల్లిదండ్రులు. పిల్లలు సైతం పరీక్షలు అయిపోయాక ఎంచక్కా ఆడుకోవచ్చునన్న ధ్యాసలో ఉంటారు. అటువంటి వారి కోసమే వేసవి సెలవులను ప్రకటించిందీ ఆ ప్రభుత్వం
ముందుముందన్నదీ పరీక్షల కాలం. వీటి కోసం వేకువ జామున లేచి పుస్తకాలతో పిల్లలతో పాటు తల్లిదండ్రులు కుస్తీ పడుతుంటారు. పరీక్షలు బాగా రాసి ఎంచక్కా ఆడుకోవాలన్న ఫీలింగ్ లో పిల్లలు ఉంటారు. ఎప్పుడు ఇవి అయిపోతాయన్న ఆలోచనే. ఏడాదంతా చదివిన చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు వచ్చేస్తాయి వేసవి సెలవులు. వేసవి సెలవులు ఎప్పటి నుండి ఇస్తారా అనే దానిపై ధ్యాస అంతా ఉంటుంది. చిన్న పిల్లలకు అయితే మరీనూ. ఈ సారి అమ్మమ్మ ఇంటికా, లేదా నానమ్మ ఇంటికా, లేదంటే ఏదైనా ట్రిప్ వేయాలా, ఇష్టమైన వాటితో ఆడుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మీ కోసమే తెలంగాణ సర్కార్ వేసవి సెలవులు ప్రకటించింది.
ఈ సారి వేసవి సెలవులు ఎప్పుడన్నదీ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ కు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 10 నుండి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఏప్రిల్ 12 నుండి పరీక్షలను ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఏప్రిల్ 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. దీంతో 1వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్మెంట్ -2(ఎస్ఏ) పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. అందుకే వీరి కోసం ఏప్రిల్ 12వ తేదీ నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
తాజాగా సవరించిన షెడ్యూల్ ప్రకారం 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు నాలుగు సబ్జెక్టులే ఉన్నందున ఏప్రిల్ 17 నాటికి వీరికి పరీక్షలు పూర్తి అవుతాయి. వీరికి ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. 6 నుండి 9వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 20 వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఆరు, ఏడు,ఎనిమిది తరగతి విద్యార్థులు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12.15 నిమిషాల వరకు పరీక్షలు రాయనున్నారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఏప్రిల్ 21న ఫలితాలను ప్రకటిస్తారు. వాటిని ప్రతి విద్యాసంస్థ రికార్డు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మార్చి రెండో వారం నుండి ఒంటిపూట తరగతులు నిర్వహిస్తారు. ఏప్రిల్ 25 నుండి జూన్ 11 వరకు వేసవి సెలవులు. ఈ సారి వేసవి సెలవులు సుమారు 48 రోజుల పాటు ఉండనున్నాయి.