తమిళనాడుకు చెందిన మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు, వైద్యురాలు అయితే తమిళిసై సౌందరరాజన్ తెలంగాణకు రెండవ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆమె తెలంగాణ కు తొలి మహిళా గవర్నర్. తాజాగా తమిళిసై సౌందరరాజన్ తన మంచితనాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..
వారణాసి నుండి తిరుగు ప్రయాణంలో ఢిల్లీ- హైదరాబాద్ అర్ధరాత్రి విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురి అయ్యాడు. విమానంలో గాల్లో ఉండడంతో అత్యవసరంగా దించేందుకు వీలులేదు. దీంతో ఫ్లైట్ అటెండెంట్ ఈ విమానంలో ఎవరైనా డాక్టర్ ఉన్నారా..? అని ప్రయాణీకులను అడిగారు. అదే విమానంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఉన్నారు. విషయం తెలిసిన డాక్టర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ వెంటనే స్పందించి ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స అందించి, భరోసా ఇచ్చి ఉపశమనం కలిగించారు.
ఇక విమానం హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత ఆ ప్రయాణీకుడిని ఎయిర్ పోర్ట్ మెడికల్ వార్డుకు తరలించారు. కోలుకున్న ప్రయాణికుడు గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపాడు. ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నా.. వైద్యురాలిగా తన బాధ్యత నిర్వహించారని ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు గవర్నర్ అభినందనలు తెలిపారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఆమెను ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Today I have onboarded with @DrTamilisaiGuv and she treated a patient who fell ill on Air on Delhi-Hyd bound flight. @IndiGo6E @TelanganaCMO @bandisanjay_bjp @BJP4India @TV9Telugu @V6News pic.twitter.com/WY6Q31Eptn
— Ravi Chander Naik Mudavath 🇮🇳 (@iammrcn) July 22, 2022
ఇది చదవండి: బ్రేకింగ్.. వరదలో చిక్కుకున్న స్కూల్ బస్!