గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు ఎమ్మెల్యే రాజా సింగ్ ను అరెస్టు చేశారు. భారీ భద్రత నడుమ రాజాసింగ్ ను ఆయన ఇంటి నుంచి తరలించారు. హేట్ స్పీచ్ పై పలు సెక్షన్ల కింద రాజాసింగ్ పై కేసులు నమోదయ్యాయి. రాజాసింగ్ కు 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. షాహినాయత్ గంజ్, మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని మంగళ్ హాట్ పోలీసులు కోరారు. ఇటీవల రెచ్చగొట్టే వాఖ్యలు చేశారంటూ రాజాసింగ్ పై హైదరాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యయాయి. రాజాసింగ్ వ్యాఖ్యలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ, ఆయన విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారంటూ పలు చోట్ల ధర్నలు కూడా చేశారు. ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్యే రాజా సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.