సామాన్యంగా విహారయాత్రలంటే ఇష్టపడని వారుండరు. అలా యాత్రలపై మక్కువతో దగ్గరలోని చుట్టూ పక్కల ప్రదేశాలను కాదని పొరుగు రాష్ట్రాలకు, దేశాలకు పరిగెడుతుంటారు జనాలు. మనకు అందుబాటు దూరంలో హైదరాబాద్ చుట్టూ ఎన్నో అద్భుతమైన కట్టడాలు – అందమైన యాత్రాస్థలాలు ఉన్నాయి. అదీగాక టూర్స్ కోసం మాత్రమే కాదండోయ్.. ట్రెక్కింగ్ ఇష్టపడే వారు ఇండియాలో ఎక్కువగా ఉత్తర రాష్ట్రాలపై పయనమవుతుంటారు. కానీ సరిగ్గా గమనిస్తే హైదరాబాద్ చుట్టూనే ఎన్నో ట్రెక్కింగ్ ప్లేసెస్ ఉన్నాయని అర్ధమవుతుంది. మరి ఆ ప్లేసెస్ ఏంటో ఓ లుకేద్దాం!
అనంతగిరి హిల్స్: వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనంతగిరి హిల్స్.. ప్రకృతి ప్రేమికులకు విశేషంగా ఆకట్టుకుంటుంది. హైదరబాద్‌కు కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పచ్చని కొండ ప్రాంతం ప్రస్తుతం ట్రెక్కింగ్ లవర్స్ కి హాట్ స్పాట్ గా మారింది. ఇక్కడికి అన్నివిధాలా ప్రయాణ సౌకర్యం ఉండటంతో ఈ మధ్య యాత్రికుల సంఖ్య పెరుగుతోంది.
భువనగిరి ఫోర్ట్: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పాపులర్ టూరిజం స్పాట్ భువనగిరి కోట. హైదరాబాద్‌కు 100 కిలో మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ పురాతన కట్టడం 610 మీటర్ల ఎత్తైన ఏకశిల రాతి పై నిర్మితమైందని చెబుతుంటారు. దాదాపుగా 40 ఎకరాల మేరా విస్తరించి ఉన్న ఈ కొండ ప్రాంతం ట్రెక్కింగ్ ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ట్రెక్కింగ్ ఇష్టపడేవారు ఇక్కడికి వెళ్ళవచ్చు.
దేవరకొండ కోట: హైదరాబాద్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దేవరకొండ కోట ఎంతో ప్రాచీన సంతతిని కలిగిఉంది. సుమారు ఈ దేవరకొండ కోటను 13వ శతాబ్ధంలో నిర్మించినట్లు సమాచారం. ఈ కోటను కొండ ప్రాంతం పై కట్టడంతో ప్రస్తుతం ట్రెక్కింగ్ లవర్స్ కి వీలుగా మారింది.
రాచకొండ కోట: హైదరాబాద్ పరిసరాల్లో నేచర్ లవర్స్ ని బాగా ఆకర్షిస్తుంది ఈ రాచకొండ కోట. నగరానికి కేవలం 55 కిలోమీటర్స్ దూరంలో ఉండటంతో పర్వతారోహకులు వెళ్లి ట్రెక్కింగ్ చేయడానికి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది.