పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని పొడిగిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇప్పటికే మూడేండ్ల వయోపరిమితి పెంచిన సంగతి తెలిసిందే. అయితే.. తెలంగాణలో మొదటిసారి 95 శాతం స్థానికత అమలులోకి రావడంతో పాటు రెండేళ్లు కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయామని అభ్యర్థుల నుంచి డిమాండ్ రావడంతో కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మరో రెండేండ్ల వయోపరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్‌ను, డీజీపీ మహేందర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించే విషయంపై సాయంత్రం వరకు స్పష్టత రానుంది.
మే 20 రాత్రి 10 గంటలకు ముగియనున్న దరఖాస్తుల గడువు
పోలీసు ఉద్యోగాలకు నేటితో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. గురువారం ఒక్కరోజే లక్ష మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్ పీఎల్ఆర్బీ ప్రకటించింది. మొత్తం నిన్నటి వరకు 5.2 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఈ సంఖ్య 6 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది.
పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, రవాణా శాఖల్లో కలిపి 17,291 యూనిఫాం ఉద్యోగాల భర్తీకి ఈ నెల 2 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే. శుక్రవారంతో దరఖాస్తులకు గడువు ముగియనున్నది. అన్ని విభాగాలకు కలిపి గురువారం వరకు 5.2 లక్షల మంది అభ్యర్థుల నుంచి 9.33 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. వీటిలో మహిళా అభ్యర్థుల నుంచే 2. 05 లక్షల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. మొత్తం దరఖాస్తుల్లో బీసీ అభ్యర్థులు 52 శాతం, ఎస్సీలు 22 శాతం, ఎస్టీలు 19 శాతం, ఓసీ 7 శాతం ఉన్నట్టు చెప్పారు. దరఖాస్తు చేసుకొనేందుకు శుక్రవారం (20వ తేదీ) రాత్రి 10 గంటల వరకు గడువు ఉన్నదని వివరించారు. తుది గడువు ముగిసేప్పటికి 5.6 లక్షల మంది నుంచి 10 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చే అవకాశమున్నదని పేర్కొన్నారు.
Pls sir,
We Want 2years age relaxation for tsplrb 2022 notification https://t.co/4vwnFmlffW— Suresh Kumar (@SureshK63752741) May 14, 2022
ఇది కూడా చదవండి: Parents: ఆస్తి ముద్దు.. అమ్మనాన్నలు వద్దు! బయటకి గెంటేసిన కుమారులు!