తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. నోటిఫికేషన్లతో పాటు ఉచిత కోచింగ్ ఇస్తామని కూడా తెలిపింది. అయితే గత నోటిఫికేషన్ల నుంచి తెలంగాణ సర్కార్ ఉచిత కోచింగ్ ఇస్తూ వస్తుంది. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో ప్రకటనతో అభ్యర్ధులకు తీపికబురును అందించింది. మీడియాతో మాట్లాడిన మంత్రి గంగుల కమలాకర్ రూ.5 లక్షల్లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు ఉచిత కోచింగ్ కు ఈ నెల 16 వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి: పోలీసులపై రెచ్చిపోయిన MIM కార్పొరేటర్! ఘటనపై KTR రియాక్షన్ వైరల్!
ఈ నెల 16 వరకు అప్లయ్ చేసుకోవచ్చని అదే రోజు అభ్యర్ధులకు ఆన్ లైన్ లో పరీక్షనిర్వాహిస్తామని తెలిపారు. ఇక ఎంపికైన వారికి 21 నుంచి 1,25,000 మందికి ఉచితంగా కోచింగ్ ఇస్తామని అన్నారు. దీంతో పాటు గ్రూప్-1,2 పరీక్షలు రాసే 10,000 మంది అభ్యర్ధులకు స్టైఫండ్ కూడా ఇస్తామని తెలిపాడు. గ్రూప్ -1 అభ్యర్ధులకు ఆరు నెలల పాటు రూ.5000, గ్రూప్-2 అభ్యర్ధులకు మూడు నెలల పాటు రూ.3000 స్టైఫండ్ ఇవ్వనున్నట్లు మంత్రి కమలాకర్ వివరించారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.