కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కూలీలకు శుభవార్తను అందించింది. ఈ ఏడాదికి కూలీ రేటును పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఏపీ, తెలంగాణలోని ఉపాధి కూలీలు లబ్ది పొందనున్నారు.
ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ ఏడాదికి కూలీ రేటును పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఏపీ, తెలంగాణలలోని ఉపాధి హామీ పథకం కూలీలు లబ్ది పొందనున్నారు. విషయం ఏంటంటే? దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పని చేస్తున్న ఉపాధి కూలీల దినసరి కూలీ రేటును పెంచుతూ కేంద్ర పంచాయితీ రాజ్ శాఖ గెజిట్ నోటీఫికేషన్ ను విడుదల చేసింది. దీంతో ఏపీ, తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్న దినసరి కూలీ రేటు రూ. 257 నుంచి 272కు పెరగనుంది.
ఈ మేరకు 2013 లో చేసిన చట్టంలో సైతం పలు సవరణలు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇకపోతే ఉపాధి హామీ పథకం కింద దేశంలో ఎంతో మంది నిరుపేదలు పనులకు వెళ్తుంటారు. వారి దినసరి కూలీ విషయానికొస్తే..అత్యధికంగా హర్యానాలో రూ. 357 ఉండగా.., ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లలో మాత్రం ఉపాధి హామీ కూలీ దినసరి రేటు రూ. కేవలం రూ. 221గా ఉంది. మరో విషయం ఏంటంటే? కేంద్రం తాజాగా పెంచిన ఉపాధి హామీ కూలీల దినసరి రేటు శనివారం నుంచి అమల్లోకి రానుంది. కేంద్రం తాజా ప్రకటనతో ఉపాధి హామీ పథకం కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.