ఒకప్పుడు ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. గల్లీకో ఏటీఎం కనిపిస్తోంది. ముందుగా డబ్బులు డ్రా చేసేందుకు మాత్రమే వచ్చిన ఏటీఎంలు.. ఆ తర్వాత డబ్బులు డిపాజిట్ చేసే సదుపాయం కూడా వచ్చింది. ఆపై మనీ ట్రాన్స్ ఫర్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా త్వరలో బంగారం కోసం కూడా ఏటీఎంలు అందుబాటులోకి రానున్నాయి. మరి.. ఈ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇప్పటి వరకు ఈ గోల్డ్ ఏటీఎంలో దుబాయ్‌తో పాటు పలు దేశాల్లో ఉండగా.. ఇప్పుడు భారత్‌లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ముందుగా హైదరాబాద్‌లో గోల్డ్ ఏటీఎంలు ఏర్పాట్లు చేస్తున్నట్లు గోల్డ్ సిక్కా సంస్థ ప్రకటించింది. భారత్ వ్యాప్తంగా 3వేల గోల్డ్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకురానుండగా.. సికింద్రాబాద్, అబిడ్స్, చార్మినార్ ప్రాంతాల్లో మెుదటి విడతగా బంగారు ఏటీఎమ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ గోల్డ్ ఏటీఎంలు ఏర్పాటు చేయడానికి చెన్నైకు చెందిన టెక్ సంస్థ ట్రూనిక్స్ డేటావేర్, కేఎల్ హై-టెక్ సెక్యూర్ ప్రింట్‌తో ఒప్పందం కుదిరింది.ఈ గోల్డ్ ఏటీఎంల నుండి ఒకేసారి 0.5 గ్రాముల నుండి 500 గ్రాముల వరకు బంగారాన్ని నాణేల రూపంలో తీసుకోవచ్చు.
ఇందుకు డెబిట్, క్రెడిట్ కార్డులు లేదా సంస్థ జారీ చేసే ప్రీపెయిడ్ కార్డులను ఉపయోగించుకోవచ్చు. గోల్డ్ ప్యూరిటీకి సంబంధించిన బీఐఎస్ సర్టిఫికేషన్, హాల్‌మార్క్ వంటివి అన్నీ ఉంటాయి. రియల్‌టైమ్ లైవ్ మార్కెట్ ప్రైస్ ప్రకారం మీ డబ్బులకు సరిపడ బంగారు కాయిన్లు వస్తాయి. కాగా, ఒక్కో మిషన్‌లో ఒకే సారి 5కిలోల బంగారాన్ని లోడ్ చేసుకోవచ్చు. ఆ మిషన్ లో రూ.2.5 కోట్లు డిపాజిట్ అయ్యాక మళ్లీ బంగారాన్ని లోడ్ చేస్తారు.మరి..ATMలో బంగారం రానున్నండ పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.