మానవుడి నుండి కంటికి కనిపించని సూక్ష్మ జీవి వరకు వాటి కంటూ ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. కొన్నినీటిలోనే జీవించగలవు. కొన్నినేలపైనే జీవనాన్ని సాగించగలవు. ఉభయ చరాలు రెండింటీలోనూ నివసించే సత్తా ఉంటుంది. అలా ఓ రైతు పెంచుకున్న మేక ఓ పని చేస్తూ వార్తల్లో నిలిచింది.
సృష్టిలో ఎన్నో వింతలు, విడ్డూరాలున్నాయి. ప్రతి జీవిలోనూ ఏదో ఒక ప్రత్యేకత నెలకొని ఉంది. మానవుడి నుండి కంటికి కనిపించని సూక్ష్మ జీవి వరకు వాటి కంటూ ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. కొన్నినీటిలోనే జీవించగలవు. కొన్నినేలపైనే జీవనాన్ని సాగించగలవు. ఉభయ చరాలు రెండింటీలోనూ నివసించే సత్తా ఉంటుంది. అక్టోపస్‌లో ఎనిమిది కాళ్లు ఉంటాయి. కంగారు జంతువుకు తన పిల్లల్ని కొన్నాళ్లపాటు తన కడుపులోనే మోస్తుంది. అలా ఓ జీవికి ఒక్కో రకమైన ప్రత్యేకత ఉంటుంది. ఇంట్లో పెంచుకునే జంతువుల క్కూడా ప్రత్యేకతలుంటాయి. కుక్క విశ్వాసం చూపగలదు. ఆవు, గేదె, మేక వంటి జంతువులు కూడా అద్భుతాలు సృష్టిస్తుంటాయి. వేలకు వేలకు లీటర్ల పాలను ఇచ్చి కొన్నిసార్లు వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా ఓ మేక అలానే వార్తలో నిలుస్తోంది.
మద్యం సేవించవద్దని ఎవరు.. ఎంతగా చెప్పినా అలవాటు పడ్డ జీవితం, సాయంత్రం అయ్యే సరికి బార్ షాపుల ముందు క్యూ కడుతుంటారు. సాయంత్రం ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించనిదే నిద్రపట్టదు మద్యం ప్రియులకు. మనుషులే కాదూ జంతువులు కూడా మద్యానికి బానిసలౌతున్నాయి. యాద్రాది భువనగిరి జిల్లాలోని ఓ రైతు దగ్గర మేక మాత్రం మద్యానికి బానిస అయ్యింది. వివరాల్లోకి వెళితే ఆత్మకూరు (ఎం) మండలం మెదుగుంటకు చెందిన సోలిపురం రవీందర్ రెడ్డి అనే రైతు ఓ మేకను పెంచుకుంటున్నాడు. అయితే ఓ రోజు అతడు తాగేటప్పుడు మేకకు మద్యం పట్టించాడు. అంతే అప్పటి నుండి ప్రతిరోజు సాయంత్రం పూట రవీందర్ మద్యం సేవించే సమయానికి కల్లా ఆయన వద్ద నిలబడుతుందట. దీంతో ప్రతి రోజు మేకకు మద్యం తాగిస్తుండటంతో దానికి అలవాటుగా మారిపోయింది. మేక మద్యం తాగుతుండటాన్ని పలువురు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. మేక మద్యం తాగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.