ప్రజా రక్షణ కోసం పని చేసే పోలీసు వ్యవస్థపై జోకులు వేయడం, వారిని విలన్స్‌గా చిత్రీకరించడం ఎక్కువ అయ్యింది. ఈ సినిమాల ప్రభావానికి తోడు, ఒకరిద్దరూ పోలీసులు చేసే తప్పులు.. సామాన్యులను వారికి దూరం చేస్తుంటాయి. పోలీస్ వ్యవస్థపై అపనమ్మకాన్ని సృష్టిస్తూ ఉన్నాయి.
ప్రజా రక్షణ కోసం పని చేసే పోలీసు వ్యవస్థపై జోకులు వేయడం, వారిని విలన్స్‌గా చిత్రీకరించడం ఎక్కువ అయ్యింది. ఈ సినిమాల ప్రభావానికి తోడు, ఒకరిద్దరూ పోలీసులు చేసే తప్పులు.. సామాన్యులను వారికి దూరం చేస్తుంటాయి. పోలీస్ వ్యవస్థపై అపనమ్మకాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. వాస్తవానికి వారి సేవలు అజరామరం. 24 గంటలు పనిచేస్తూ, నిద్రాహారాలు మానేసి, ఫ్యామిలీ లైఫ్‌ను విడిచిపెట్టి విధులు నిర్వర్తిస్తుంటారు. ప్రజలు హాయిగా నిద్రపోగల్చుతున్నారంటే.. దానికి కారణం రక్షక భటులే. విధి నిర్వహణలో తమకు తామే సాటి అని మరోసారి నిరూపించారు హైదరాబాద్ పోలీసులు. సామాన్యుల సేవకే తాము కట్టుబడి ఉన్నామని చెప్పేందుకు ఈ ఘటనే అసలైన నిదర్శనం.
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్‌లో నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ కేసు అందుకు ఉదాహరణ. నిన్న రాత్రి కిడ్నాప్ అయిన పాప కథ సుఖాంతమైంది. ఈ డబ్ల్యుయస్ కాలనీలో కృష్ణవేణి అనే చిన్నారి సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్లి తిరిగిరాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఎంత వెతికినా కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఘట్ కేసర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సురేష్ అనే వ్యక్తి ఆ పాపను తీసుకెళ్లినట్లు గుర్తించి స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఎక్కడిక్కడే సమాచారం చేరవేస్తూ, నిందితుడి ఆచూకీని కనుగొన్నారు. పాప మిస్సైన కొన్ని గంటల్లోనే చేధించి.. నిందితుడ్ని పట్టుకుని, తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. దీంతో ఆ తల్లిదండ్రులు ఆనంద ఢోలికల్లో తేలిపోతున్నారు.
పాపను రాచకొండ పోలీసులు సజీవంగా తీసుకువచ్చి అప్పగించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. పాప తండ్రి, కుటుంబ సభ్యులు రాచకొండ ఎస్ఐ కాళ్లపై పడ్డారు. చేతులెత్తి మొక్కారు. అయితే అలాంటివి చేయవద్దని ఆయన వారించారు. ఈ ఘటనతో అక్కడి ప్రజలు పోలీస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో యావత్ తెలుగు ప్రజల్లో పోలీసు వ్యవస్థ పట్ల పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. వీరి కష్టానికి నిజమైన ప్రతిఫలం దక్కినట్లయ్యింది. పాపను రక్షించిన రైల్వే పోలీసులు, ఘట్ కేసర్ పోలీసులను అక్కడి ప్రజలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పాప మిస్ అయిన గంటల వ్యవధిలోనే తల్లితండ్రుల వద్దకు చేర్చిన పోలీసు వ్యవస్థపై అభినందనల వర్షం కురుస్తోంది. పోలీసులకు సెల్యూట్ చేస్తున్నారు. మీరు కూడా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.