విజయవాడ జాతీయ రహదారిపై ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్.. అదుపుతప్పి బోల్తా పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ కూడలి వద్ద డివైడర్ ను ఢీ కొట్టడంతో అదుపు తప్పింది. రోడ్డుకి అడ్డంగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. గ్యాస్ ట్యాంకర్ కావడంతో గ్యాస్ లీక్ అవుతుందని, ఆపై పేలుతుందేమోనని అక్కడున్న జనం భయంతో పరుగులు తీశారు. ట్యాంకర్ దగ్గరకు వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క బోల్తా పడిన గ్యాస్ ట్యాంకర్ ను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని తెలుస్తుంది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందా? లేక వేరే కారణాల వల్ల ఇలా జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ ట్యాంకర్ గుజరాత్ నుంచి చెన్నైకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. పరుగులు తీసిన స్థానికులు
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ గ్యాస్ ట్యాంకర్.. అబ్దుల్లాపూర్‌మెట్ కూడలి వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. అది గ్యాస్ ట్యాంకర్ కావడంతో అక్కడున్న వారు దూరంగా పరుగులు తీశారు.#Gasstanker #TSNEWS #VIDEOS pic.twitter.com/0DsS22YCXd
— Eenadu (@eenadulivenews) January 3, 2023