సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు వెలుగులోకి వస్తున్నారు. ముఖ్యంగా టిక్ టాక్ వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కళాకారులు తమ లాటెంట్ తో ఎంతో మంది ఆడియన్స్ మనసు దోచుకున్నారు. అలాంటి వారిలో ‘గద్వాల్ బిడ్డ’ ఎస్. మల్లికార్జున్ రెడ్డి ఒకరు. చిన్న వయసులోనే తన దైన డైలాగ్స్ తో ఎంతో మంది మనసు దోచుకున్నాడు. మాట్లాడేది వ్యంగం అయినా.. తన వాయిస్ తో అందరినీ అలరించాడు. కానీ. అలాంటి గద్వాల్ బిడ్డ, సోషల్ మీడియా మోస్ట్ లవబుల్ కిడ్ మల్లికార్జున్ అకాల మరణం అందరిని దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లికార్జున్ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మల్లికార్జున్ చాలా చిన్న వయసులోనే ఊబకాయం, ఆస్తమా సమస్యలకి గురి అయ్యాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా మల్లికార్జున్ ఆరోగ్యం మాత్రంసరికాలేదు. ఇక చివరి రోజుల్లో తాను మరణించడం ఖాయమని ఆ చిన్నారికి తెలిసినా.., ఎవ్వరిని ఎలాంటి సాయం కోరలేదు. ఓ చిన్న వీడియోతో ఫేమస్ అయిన ఈ గద్వాల్ బిడ్డ.. తరువాత కాలంలో ఏనాడు కూడా తన క్రేజ్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేయలేదు.
ఇది చదవండి: వైరల్ అవుతున్న లతా మంగేష్కర్, ప్రధాని మోదీ ఫోన్ కాల్ సంభాషణ
కనీసం తాను ఆనారోగ్యంతో అంతలా బాధపడుతున్నా ఆ విషయాన్ని బయటపెట్టి సింపతీ దక్కించుకోవాలన్న ప్రయత్నం కూడా చేయలేదు. మల్లికార్జున్ ఇప్పుడు మన ముందు లేకపోయినా.. అతని వీడియోలు, మీమ్స్, స్టిక్కర్స్ ఎప్పటికీ ఆ పిల్లాడిని గుర్తుకి చేస్తూనే ఉంటాయి. మరి.., గద్వాల్ బిడ్డ మల్లికార్జున్ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం.