ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తూ.. కోట్లలో డబ్బును కాజేస్తున్నారు. ఇలా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయంటూ పోలీస్ స్టేషన్లకు రోజు పదుల సంఖ్యలో బాధితులు వెళ్తుంటారు. పోలీసులు సైతం కేసులో నమోదు చేసి.. నేరగాళ్ల పట్టుకునేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. ఈక్రమంలో కొందరు సైబర్ కేటుగాళ్లను పోలీసులు అరెస్టు చేస్తుంటారు. అయితే సైబర్ కేసుల్లో డబ్బు రికవరీ అనేది అంత ఈజీగా అయ్యే పనికాదు. తెలంగాణలోని సైబరాబాద్ పోలీసులు కొందరి సైబర్ నేరగాళ్ల ఆటకట్టించి.. వారి నుంచి రూ.9.81 కోట్ల డబ్బును రికవరీ చేశారు. సైబర్ దొంగల నుంచి డబ్బులు రికవరీ చేయడం దేశంలోనే ఇదే తొలిసారి. వివరాల్లోకి వెళ్తే..
రాజస్థాన్,యూపీలకు చెందిన అభిషేక్ జైన్, పవన్ కుమార్ ప్రజాపత్, ఆకాష్ రాయ్, కృష్ణ రాయ్ అనే నలుగురు యువకులు మార్కెట్ బాక్స్ అనే ట్రేడింగ్ యాప్ ప్రారంభించారు. అయితే ఈ మార్కెట్ బాక్స్ అనే ట్రేడింగ్ యాప్ ను సెబీలో నమోదు చేయలేదు. అభిషేక్ జైన్ ఈ యాప్ ను డెవలప్ చేశాడు. ఈ యాప్ ద్వారా ఎందరో అమయాకులను ఈ కేటుగాళ్లు మోసం చేశారు. పెట్టుబడులు, ట్రేడింగ్ ల పేరుతో కోట్లు కొల్లగొట్టారు. చివరకి బాధితుల ఫిర్యాదులతో హైదరాబాద్ పోలీసులు రాజస్థాన్, యూపీలో భారీ ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలో నలుగురు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.9.81 కోట్లు రికవరీ చేశారు. ఫోన్, మెయిల్స్‌కు వచ్చే ఫేక్ మెసేజ్‌లను నమ్మి మోసపోవద్దని సైబరాబాద్ పోలీసులు సూచించారు. రెట్టింపు లాభాల అని చెబితే నమ్మవద్దని.. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇంత పెద్ద మొత్తంలో సైబర్ నేరగాళ్ల నుండి డబ్బులు రికవరీ చేయడం దేశంలో ఇదే మొదటి సారి. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.