రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ 1995 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ (గురుకులాల) కార్యదర్శిగా ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం బహుజన సమాజ్ పార్టీ లో కొనసాగుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలపై ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో బీఎస్పీ బలోపేతం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రజా సేవకు ఉద్యోగంతో పనిలేదని భావించి పదవీవిరమణ ప్రకటించిన ఆయన నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై టీఆర్ఎస్, బీజేపీలు పరస్పరం విమర్శలు చేసుకోవడంపై కూడా ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. తాజాగా నల్గొండ జిల్లా నార్కెట్ పల్లిలో పర్యటించారు. అక్కడ ఓ వరి కల్లంలో కూలి పనిచేశారు. వడ్ల బస్తాలు మోసి రూ.100 సంపాదించారు.
‘ఈ రోజు నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి వరి కల్లంలో హమాలీ పని చేసి ₹100/- సంపాదించాను. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదోయ్’ అంటూ ట్విట్టర్ వేధికగా స్పందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ రోజు నల్గొండ జిల్లా నార్కెట్పల్లి వరి కల్లంలో హమాలీ పని చేసి ₹100/- సంపాదించాను. శ్రమైకజీవన సౌందర్యానికి సమానమైనది లేనోలేదోయ్. Earned ₹100/- by as hamali today. Not an easy job.🙏🏼 आज हमालि काम कर के मैंने ₹100/- कमाया। इतना आसान नहीं है ये काम। हाथी 🐘हमेशा श्रमिकों का साथी। pic.twitter.com/HE4dsVjJ3o
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) December 1, 2021