తెలంగాణ వనపర్తి జిల్లాలో కేజీబీవీలో కలుషిత ఆహారం కలకలం రేపింది. సుమారు 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైయ్యారు. వారిని సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం గురుకుల, కస్తూర్భా విద్యాలయాలను పునరుద్దరించింది. పౌష్టికాహారం, బుక్స్, దుస్తులు ఇలా అన్ని సౌకర్యాలను అందిస్తూ విద్యాలయాలను నడుపుతున్నారు. ఇటువంటి హాస్టళ్లలో చాలా మంది స్టూడెంట్స్ గ్రామాల నుండి వచ్చి తమ చదువును కొనసాగిస్తున్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల అరకొర వసతులతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అప్పుడప్పుడు ఫుడ్ పాయిజన్ కూడా జరిగి పిల్లలు ఆరోగ్యపరంగా సఫరవుతున్నారు. వనపర్తి జిల్లా అమరచింత కేజీబీవీలో కలుషిత ఆహారం తిని సుమారు 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైయ్యారు. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివారాల్లోకి వెళితే..
తెలంగాణలోని వనపర్తి జిల్లా అమరచింత కస్తూర్బా విద్యాలయంలో ఆరో తరగతి నుండి ఇంటర్మీడియేట్ వరకు మొత్తం 210 మంది స్టూడెంట్స్ చదువును కొనసాగిస్తున్నారు. తాజాగా నిన్న రాత్రి విద్యార్థినుకు వంకాయ, సాంబారుతో భోజనం వడ్డించారు. ఆ తర్వాత కొంతమంది స్టూడెంట్స్‌కి ఫుడ్‌పాయిజన్ అయింది. రాత్రి ఫుడ్ తిన్నాక 11 గంటల సమయంలో విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడుతూ.. ఒక్కొక్కరు తమ ఉపాధ్యాయురాలికి తెలిపారు. 70 మంది వరకు విద్యార్థినులు అస్వస్థతకు గురైయ్యారు. రాత్రిపూట కేజీబీవీలో ఒక టీచర్, వాచ్‌మన్ మాత్రమే ఉంటారు. అయితే రాత్రి సమయం కావడంతో విద్యార్థినులను బయటికి వెళ్లనివ్వలేదు. తెల్లవారుజామున విద్యార్థినులను ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వెంటనే ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించగా.. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి అదుపులోకి వచ్చింది. నలుగురు విద్యార్థినులు కడుపునొప్పి ఎక్కువగా ఉందనడంతో వారిని మెరుగైన చికిత్స కోసం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. పిల్లలు అస్వస్థతకు కారణమేంటో విచారించాలని అధికారులను కోరుతున్నారు. ఆహారంలో కలుషితం జరిగిందా.. లేక మరేదైనా కారణమా అన్న కోణంలో అధికారులు
విచారణ జరుపుతున్నారు. అస్వస్థతకు గురైనవారిలో ప్రత్యేకంగా 9,10, ఇంటర్ విద్యార్థినులే ఉన్నారు. ఫుడ్‌పాయజన్ వల్లనే తమకు ఈ పరిస్థితి నెలకొందని విద్యార్థినులు తెలిపారు.