హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు మేఘాల్లా ఆకాశాన్ని కప్పేశాయి. ఫర్నిచర్ షాప్ కావడంతో మంటలు ఇంకా త్వరగా వ్యాపించాయి. వివరాల్లోకి వెళ్తే.. ఎల్బీ నగర్ హస్తినపురంలోని ఓ ఫర్నీచర్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎగిసి పడుతున్న మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అయితే అగ్ని ప్రమాదానికి కారణం మాత్రం తెలియరాలేదు. అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యిందా? లేక ఎవరైనా నిప్పు పెట్టారా? అనే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.