Tamarind Tree: సికింద్రాబాద్‌లో ఓ భారీ చింత చెట్టు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ చెట్టునుంచి పెద్ద మొత్తంలో మంటలు బయటకు రావటంతో జనం ఆందోళనకు గురయ్యారు. బుధవారం జీడిమెట్ల 31వ బస్టాప్, పాలికా బజార్‌లోని పెద్ద చింత చెట్టు పొగలు చిమ్మింది. దీంతో అక్కడి జనం భయపడిపోయారు. ఆ కొద్దిసేపటికే మంటలు కూడా వచ్చాయి. పక్కనే ఉన్న ఇళ్లలోకి దట్టమైన పొగలు చేరుకోవటం మొదలుపెట్టాయి. దీంతో స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, ఆ చింత చెట్టుకు కరెంట్ మీటరు బిగించి ఉండటంతో లైన్‌మెన్ వచ్చే వరకు ఆగాల్సి వచ్చింది. అనంతరం మంటల్ని ఆర్పారు. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : తప్పతాగి.. పెళ్లి చేసుకున్న మగాళ్లు.. మత్తు దిగాక అదిరే ట్విస్ట్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.