ఈ మధ్యకాలంలో తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల సికింద్రాబాద్ ప్రాంతంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాల కారణంగా పలువురు మృతి చెందారు. తాజాగా హైదరాబాద్ లోని పురానపూల్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఇటీవల తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలకు కారణాలు ఏమైనప్పటికి ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ అగ్నిప్రమాదాల ఘటనల్లో తీవ్రంగా గాయపడిన ఎందరో జీవితాన్ని అతికష్టం మీద సాగిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లోని ఓ లాడ్జీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని పది మంది మరణించిన సంగతి తెలిసిందే. అలానే సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ నాలుగు అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని ముగ్గురు యువకులు మరణించారు. రెండు రోజుల క్రితం కూకట్ పల్లిలో మూడు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలు మరువక ముందే భాగ్యనగరంలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ లోని పురానాపూల్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పురానాఫూల్ లో ఉన్న కూలర్లను నిల్వ చేసిన ఓ గోడౌన్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ కూలర్ల గోడౌన్ నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటల ధాటికి భారీగా పొగ వెలువడుతుంది. ఆ ప్రాంతమంతటిని నల్లటి మేఘాలు కమ్మేశాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడి ఆరు అగ్నిమాప వాహనాలు చేరుకున్నాయి. గోడౌన్ ను నలువైపుల మోహరించిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ అగ్నిప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఏమిటనేది తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూటా, మరేదైనా కారణమా? అనేది తెలియాల్సి ఉంది.
భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో సమీపంలో ఉండే కుటుంబాలు, దుకాణాల వాళ్లు భయందోళనకు గురవుతున్నారు. అటుగా వెళ్తున్న వాహనదారులు కూడా భయపడుతున్నారు. దట్టమైన పొగలతో ఆ ప్రాంతంలోని ఆకాశమంత నల్లగా మారిపోయింది. వేసవి కాలం రాక ముందే ఇలా అగ్నిప్రమాదాలు జరుగుతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ లో కూడా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం అన్నదాన భవనంలోనూ స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లోని పురానాపూల్ లో ఈ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.