సికింద్రాబాద్ దక్కన్ మాల్ అగ్ని ప్రమాద మంటలు ఇంకా చల్లారక ముందే.. నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అది కూడా.. నగరవాసులకు వినోదాన్ని పంచే నుమాయిష్ ఎగ్జిబిషన్ లో చోటుచేసుకోవటం గమనార్హం. ఈ ప్రమాదంలో ఐదు కార్లు దగ్ధమయినట్లు తెలుస్తోంది. పార్కింగ్ చేసిన ఓ ఎలక్ట్రిక్ కారులో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ మంటలు పక్కనున్న మరో నాలుగు కార్లకు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు చెప్తున్నారు. వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసినట్లు సమాచారం. దీంతో ప్రమాదం తప్పినట్లుగా చెప్తున్నారు. ఈ ఘటనతో నాంపల్లి పరిసర ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. వీకెండ్ కావడంతో సందర్శకులు నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు పోటెత్తారు.
కాగా, నుమాయిష్ ఎగ్జిబిషన్ పార్కింగ్ లో మంటలు అంటుకున్నాయని తెలియడంతో జనాలు ఒక్కసారిగా పరుగులు పెట్టినట్లు స్థానికులు చెప్తున్నారు. అందుకు కారణం.. 2019లో నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడమే. ఓ బ్యాంకు ఏర్పాటు చేసిన స్టాల్ లో మొదలైన మంటలు భారీ నష్టాన్ని మిలిల్చాయి. ఈ ఘటనలో దాదాపు 300 కు పైగా దుకాణాలు పూర్తిగా కాలిపోగా, 40 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. నగరంలో ఇలా వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడానికి గల కారణాలు ఏంటన్నది..? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#NampallyFire: Fire broke out in an electric car at a car parking area in the #Nampally #Numaishexhibition in Hyderabad on Saturday evening. The fire spread to a few more cars, which were damaged. @NewsMeter_In @KanizaGarari @CoreenaSuares2 pic.twitter.com/un4ubCm5g0
— SriLakshmi Muttevi (@SriLakshmi_10) January 21, 2023
Coordinated the rescue operation along with @CommissionerGHMC, @Director_EVDM &DRF teams, police and fire fighting personnel at exhibition, Nampally, where a huge fire accident took place. No human loss took place.@KTRTRS @TelanganaCMO @arvindkumar_ias @ZC_Khairatabad pic.twitter.com/wN2plVE6rg
— Dr. Bonthu Rammohan (@bonthurammohan) January 30, 2019