సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో తమ టాలెంట్ తో క్రేజ్ పెంచుకున్నారు. చిన్న వయసులో తన దైన డైలాగ్స్ తో ఎంతో మంది మనసు దోచుకున్నాడు ‘గద్వాల్ బిడ్డ’ అలియాస్ ఎస్. మల్లికార్జున్ రెడ్డి. అయితే గద్వాల్ బిడ్డ, సోషల్ మీడియా మోస్ట్ లవబుల్ కిడ్ మల్లికార్జున్ అకాల మరణం అందరిని దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లికార్జున్ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మల్లికార్జున్ చాలా చిన్న వయసులోనే ఊబకాయం, ఆస్తమా సమస్యలకి గురి అయ్యాడు. కుటుంబ సభ్యులు ఎంతో మంది డాక్టర్లను సంప్రదించినా.. జాగ్రత్తలు తీసుకున్నా మల్లికార్జున్ ఆరోగ్యం మాత్రంసరికాలేదు. తాను త్వరలో మరణిస్తానని తెలిసి కూడా ఎవ్వరిని ఎలాంటి సాయం కోరలేదు. తనకున్న ఉన్న క్రేజ్ ని ఏమాత్రం దుర్వినియోగం చేసుకోలేదు. ఓ చిన్న వీడియోతో ఫేమస్ అయిన ఈ గద్వాల్ బిడ్డ.. తరువాత కాలంలో ఏనాడు కూడా తన క్రేజ్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేయలేదు.
ఇది చదవండి: ‘గద్వాలబిడ్డ’ మల్లికార్జున్ కన్నుమూత!
తన ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఓపెన్ గా చెప్పి బాధపడలేదు.. సింపతీ దక్కించుకోవాలన్న ప్రయత్నం కూడా చేయలేదు. గద్వాల్ బిడ్డ వీడియోలు, మీమ్స్, స్టిక్కర్స్ ఎప్పటికీ ఆ పిల్లాడిని గుర్తుకి చేస్తూనే ఉంటాయి. నేడు జోగులాంబా గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నె గ్రామంలో ‘గద్వాల్ బిడ్డ’ ఎస్. మల్లికార్జున్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన వ్యూజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్న వయసులోనే ఎంతో మంది ఆదరాభిమానాలు సంపాదించుకున్న మల్లికార్జున్ అర్ధాంతరంగా అందరినీ విడిచి వెళ్లడం అందరి హృదయాలు కలచి వేస్తున్నాయి.
ఇది చదవండి : గద్వాల్ బిడ్డ.. మల్లికార్జున్ ఎందుకు చనిపోయాడు?
కుర్చీలో కూర్చోబెట్టి మల్లికార్జున్ చే కేక్ కట్ చేయిస్తూ.. హ్యాపీ బర్త్ డే అంటూ కుటుంబ సభ్యులు ఏడుస్తున్న దృశ్యాలు చూస్తుంటే ప్రతి ఒక్కరి కంట కన్నీరు వస్తుంది. ‘గద్వాల్ బిడ్డ’ వెంటనే గుర్తుకు వచ్చే మల్లికార్జున్ విగత జీవిగా కనిపించడం చూస్తుంటే ప్రతి ఒక్క నెటిజన్ గుండె పగిలిపోతున్నట్లుంది.
నీకు అప్పుడే నిండు నూరేళ్లూ నిండాయా కొడకా అంటూ ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన అందరి మనసును కదిలించి వేస్తున్నాయి. ప్రస్తుతం ‘గద్వాల్ బిడ్డ’ ఎస్. మల్లికార్జున్ రెడ్డి అంత్యక్రియలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.