డబ్బులు సంపాదించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే సక్రమ మార్గంలో సంపాదిస్తే ఏ భయం లేకుండా బతకొచ్చు. కానీ రాత్రికి రాత్రే ధనవంతులం అయిపోవాలని అక్రమ మార్గంలో గనుక ప్రయాణిస్తే ఏదో ఒక రోజు జైలులో ఊసలు లెక్కబెట్టడం ఖాయం. అలా చెడు మార్గంలో డబ్బులు వెనకేసుకోవాలనుకున్న నకిలీ కరెన్సీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
డబ్బులు సంపాదించాలని అందరికీ ఉంటుంది. అయితే కొంతమంది నిజాయితీగా డబ్బును సంపాదిస్తారు. సక్రమ మార్గంలో వెళ్తూ హుందాగా జీవిస్తారు. మరికొంతమంది మాత్రం అక్రమార్జనకు దారులు వెతుకుతుంటారు. ఇలాంటి వారు రాత్రికి రాత్రే ధనవంతులు అవ్వాలని భావిస్తారు. ఈ క్రమంలో తప్పుడు దారిలో ప్రయాణించి ఏదో ఒక రోజు అడ్డంగా దొరికి జైలులో ఊసలు లెక్కబెడతారు. ఇలాంటి చెడు దారుల్లో ఫేక్ కరెన్సీ ముద్రణ ఒకటి. కొందరు మోసగాళ్లు నకిలీ కరెన్సీ ప్రింటింగ్లో పట్టుబడిన వార్తలను ఇటీవల వింటూనే ఉన్నాం. ప్రభుత్వాలు దీన్ని అరికట్టడానికి ఎంత ప్రయత్నిస్తున్నా పరిస్థితుల్లో పెద్దగా మార్పు రావడం లేదు. ఫేక్ కరెన్సీ దేశ ఆర్థిక వ్యవస్థపై ఎంతటి చెడు ప్రభావాన్ని చూపిస్తుందో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈజీ మనీ కోసం వెంపర్లాడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.
ఇక, హైదరాబాద్లోని పాతబస్తీలో నకిలీ కరెన్సీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ఫర్జీ’లో మాదిరిగా నకిలీ కరెన్సీని ముద్రిస్తున్న గ్యాంగ్ గుట్టురట్టయింది. పక్కా సమాచారంతో ఈ ముఠాపై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి శారు. ఓల్డ్ సిటీలో ఫేక్ కరెన్సీని ప్రింట్ చేస్తున్న ఆఫీసుల మీద పోలీసులు దాడులు చేపట్టారు. రూ.30 లక్షల నకిలీ కరెన్సీ నోట్లతో పాటు ప్రింటర్, పేపర్, కలర్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. మహిళతో సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా ఈ ముఠా పెద్ద ఎత్తున ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఉత్తర్ ప్రదేశ్, బిహార్, గుజరాత్ సహా ఇతర రాష్ట్రాల్లో కూడా నిందితుల మీద కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.