మధ్యాహ్నం వేళ సూర్యుడి ప్రతాపం సమయంలో నీడ కనిపించడం లేదంటే అందరికి ఆశ్చర్యం గానే ఉంటుంది. అయితే అలాంటి అరుదైన దృశ్యం ఇటీవలే బెంగళూరులో చోటుచేసుకుంది. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లో కూడా నీడ పడని రోజు రానుంది. మరి.. ఆ జీరో షాడో డే ఎప్పుడు,.. ఈ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇటీవలే బెంగళూరులో అద్భుత ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 25 బెంగళూరు పట్టణంతో పాటు మరికొన్ని ప్రాంతంలో జీరో షాడో డే ఆవిష్కృతమైంది. జీరో షాడో డే అంటే సూర్యుడు వెలుగు దేనిమీద అయినా పడుతుండగా.. దాని నీడ కనిపించదు. శాస్త్రవేత్తలు చెప్తున్న ప్రకారం.. ఏప్రిల్ 25న మధ్యాహ్నం 12.17 గంటలకు బెంగళూరులో ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ క్యాంపస్‌లో 60 నుంచి 120 సెకండ్లపాటు పొడవైన వస్తువుల నీడ కనిపించలేదు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చాలా మంది చూశారు. అలానే ఈ సారి హైదరాబాద్ వాసులకు కూడా ఈ అద్భుతాన్ని చూసే అవకాశం రానుందంట. మరి.. హైదరాబాద్ లో జీరో షాడో డే ఎప్పుడు.. ఆ వివరాలు ఏమిటే ఇప్పుడు తెలుసుకుందాం..
ఈనెల 25న బెంగుళూరులో నగరంలో జీరో షాడో డే ఏర్పడింది. దాదాపు మూడు నిమిషాల పాటు నీడ భూమిపై కనిపించలేదు. ఈ అరుదైన దృశ్యాన్ని బెంగుళురు వాసులు ఆస్వాదించారు. అయితే జీరో షాడో డే గా పిలిచే ఈ అసాధారణమైన సంఘటనను చూసే అవకాశం హైదరాబాదీలకు కూడా కలిగింది. మే 9 మధ్యాహ్నం 12:12 గంటలకు ఈ అరుదైన ఘటన ఆవిష్కృతం కానుంది. సాధారణంగా కర్కాటక రాశి మరియు మకర రాశి మధ్య ప్రాంతాలలో జీరో షాడో ఏర్పడుతుంది. ఈ ప్రాంతాలలో నివసించే ప్రజలకు, ఉత్తరాయణం, దక్షిణాయనం రెండింటిలోనూ సూర్యుని క్షీణత అక్కడి అక్షాంశానికి సమానంగా ఉంటుంది.
ఆ సమయంలో సూర్య కిరణాలు భూమిపై నిట్ట నిలువునా పడతాయి. అందువల్ల నిలువుగా ఉండే ఏదైనా వస్తువు లేదా జీవులు నీడను ఏర్పచలేదు. ఈ ఘటన ఏడాదిలో రెండుసార్లు సంభవిస్తుంది. ఇటీవలే బెంగళూరు ఏర్పడిన ఈ జీరో షాడో డే.. మే 9న హైదరాబాద్ లో కనువిందు చేయనుంది. హైదరాబాద్‌లో జీరో షాడో డే మే 9 మధ్యాహ్నం 12:12 గంటల సమయంలో ఏర్పడనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే ఈ ఏడాది ఆగస్టు 18న కూడా ఇలా జరగనుందట. గతంలో 2021లో ఒడిశాభువనేశ్వర్‌లో ఈ అద్భుతం జరిగింది. మరి.. ఈ అరుదైన ఘటనకు హైదరాబాద్ లో ఆవిష్కృతం కానుండపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.