బీఆర్ఎస్ విసృతస్థాయి సమావేశంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టతనిచ్చారు. బీఆర్ఎస్ విసృతస్థాయి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదు.. అంతా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. అక్టోబర్ లో భారీ ఎత్తున బీఆర్ఎస్ ప్లీనరి నిర్వహాంచాలని అన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కీలకం కానున్నాయని.. సీఎం కేసీఆర్ విసృతస్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లేదే లేదని.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని.. ఇందుకు బీఆర్ఎస్ నేతలు సంసిద్దంగా ఉండాలని అన్నారు. ఎన్నికలు అయ్యేంత వరకు ప్రజల్లోనే ఉండాలని.. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. వీలైతే నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తూ ప్రజలతో మమేకం కావాలని సూచించారు. డిసెంబర్ మాసంలో ఎన్నికలకు పక్కా ప్లాన్ చేసుకోవాలని అన్నారు. ప్రతి ఎమ్మెల్యే నిత్యం ప్రజలతో మాట్లాడుతూ.. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తూ వాళ్లలో నమ్మకం పెంచుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పనితీరు బాగుందని.. ప్రజలకు మరింత సేవలు చేయాలని అన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన అన్నారు. అంతేకాదు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను పరిష్కరించే దిశగా పనులు చేయాలన్నారు. ఇక ప్రతి ఎమ్మెల్యే వద్ద లబ్ధిదారుల పూర్తి సమాచారం తప్పకుండా ఉండాలని తేల్చి చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ నిత్యం ప్రజలతో మమేకం కావాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ లు ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తుందని.. వారి పన్నాగాలను సమర్ధవంతంగా తిప్పి కొట్టాలని సూచించారు.