మల్కాజ్ గిరిలో జరిగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పంది కొవ్వుతో చేసిన నూనెను విక్రయిస్తున్న వ్యక్తిని మల్కాజ్ గిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. యువకుడు అమ్మగా కొనుగోలు చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా బయటి ఫుడ్ తినడానికే ఇష్టపడుతున్నారు. పైపై మెరుగులతో అప్పటికప్పుడు మసాలాలు గుప్పించి వేడివేడిగా వడ్డించే సరికి అందరికి బయటి ఫుడ్ నచ్చుతుంది. కానీ అది ఆరోగ్యానికి ఎంత హానికరమో ఆలోచించాలి. హోటల్స్‌లో, బండ్ల మీద రోడ్డు పక్కన, స్ట్రీట్ ఫుడ్ తినేటప్పుడు నోటికి రుచిగా ఉండి మరింత లాగించేస్తాం. కానీ తర్వాత తెలస్తుంది. అది ఎంత అనారోగ్యానికి దారి తీస్తుందో. మనం తినే ఆహారంలో చికెన్ ఫ్రై, ఫ్రైడ్ రైస్ ఇంకా ఫ్రై ఐటమ్స్ కూడా తింటుంటాం. వంట కోసం వాడే నూనెలు, మసాలాలు, చికెన్, మాంసం వంటివి నాసిరకంవి తెచ్చి ఉపయోగిస్తుంటారు. అవి ప్రాణాలను హరించివేస్తాయి. ముఖ్యంగా నూనెలు వాడకంలో తేడా వచ్చిందంటే మనకు ఇన్నర్ ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోతాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా మొదలవుతాయి. అందుకని జొమోటో, స్విగ్గీలు ఆర్డర్ చేసేటప్పుడు కూడా ఆలోచించి తినండి. ఇటీవల తాజాగా మల్కాజ్ గిరిలో జరిగిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పంది కొవ్వుతో చేసిన నూనెను విక్రయిస్తున్న వ్యక్తిని మల్కాజ్ గిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
రమేశ్ శివ అనే యువకుడు నేరెడ్‌మెట్ పరిధిలోని ఆర్కేపురంలో నివసిస్తున్నాడు. తను ఇంట్లోనే కొన్నేళ్లుగా పంది కొవ్వుతో నూనెలు తయారు చేసి విక్రయిస్తున్నాడు. పంది మాంసం విక్రయించే వారి దగ్గర కొవ్వు తీసుకుని, దాన్ని వేడి చేసి దానిలో కొన్ని రసాయనాలు కలిపి నూనె తయారు చేస్తున్నాడు. ఇలా తయారు చేసిన నూనెను తక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు రమేశ్ నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. పంది కొవ్వుతో నూనె తయారు చేస్తున్నట్లు గమనించారు. బుధవారం పంది కొవ్వుతో నూనె అమ్ముతున్న యువకుడిని నేరెడెమెట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుడు అమ్మగా కొనుగోలు చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.