హైదరాబాద్ లో ఎన్నో అద్బుతమైన పర్యాటక స్థలాలు ఉన్నాయి. దుర్గం చెరువు కేబుల్ బ్రడ్జి అందాలను తమ కెమెరాల్లో బంధిస్తారు.. సెల్పీలు తీసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక రాత్రిపూట ఈ బ్రిడ్జి అందం మరింత రెట్టింపు అయినట్లు లైటింగ్ తో మిరుమిట్లు గొలుపుతుంది.
హైదరాబాద్ లో ఎన్నో అద్బుతమైన పర్యాటక స్థలాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారు నగరంలోని అందాలను చూసి పులకించిపోతుంటారు.. తమ కెమెరాల్లో బంధిస్తారు.. సెల్పీలు తీసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక హైదరాబాద్ లో సెల్ఫీ స్పాట్ గా చెప్పుకునే ప్రదేశం దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి. సినిమా షూటింగ్స్ కూడా ఇక్కడ బాగానే జరుగుతుంటాయి. రాత్రి సమయాల్లో కేబుల్ బ్రిడ్జి లైటింగ్ తో మెరిసిపోతూ ఉంటుంది.. అందుకే ఎక్కువ సందర్శకులు వస్తుంటారు. ఈ బ్రిడ్జి ఒక టూరిస్ట్ స్పాట్ మారింది. హైదరాబాద్ వాసులకు అలర్ట్.. కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలను ఐదు రోజుల పాటు నిషేధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ వాసులను ఎంతగానో ఆకర్షిస్తున్న టూరిస్ట్ స్పాట్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి.. దీన్నే తిగెల వంతన అని పిలుస్తుంటారు. శని, ఆదివారాల్లో నగర వాసులు తమ ఫ్యామిలీతో కలిసి వచ్చి తెగ ఎంజాయ్ చేస్తుంటారు.. రాత్రిపూట లైటింగ్ అందాలతో కేబుల్ బ్రిడ్జి మిరుమిట్లుగొలుపుతుంది. చాలా మంది సందర్శకులకు కేబుల్ బ్రిడ్జి సెల్ఫీ స్పాట్‌గా నిలిచిందని చెప్పవచ్చు. తాజాగా కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలను ఐదు రోజుల పాటు నిషేధిస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 6 వ తేదీ నుంచి కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలు నిషేదం విధించడంతో ట్రాఫిక్ పోలీసులు అక్కడ నుంచి ఇతర మార్గాల్లో వాహనాలను మళ్లిస్తున్నారు. కాగా, కేబుల్ బ్రడ్జి మెయింటెనెన్స్ లో భాగంగా ఐదు రోజుల పాటు ప్రజలు ఎవరూ ఇటువైపు రావొద్దని ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.